Farmers : రైతులకు బ్యాడ్ న్యూస్.. నిలిచిపోయిన డబ్బుల పంపిణీ
Farmers : రైతు బంధు నిధుల కోసం ఎంతగానో ఎదురు చూసిన అన్నదాతలు ఇప్పుడు నిరాశకు గురవుతున్నారు. రాష్ట్రంలో రైతుబంధు నిధుల చెల్లింపులు నత్త నడకన సాగుతున్నాయి. గత డిసెంబరు 28న రైతుబంధు నగదు బదిలీ ప్రారంభం కాగా.. ఇంత వరకు ఏ జిల్లాలో కూడా చెల్లింపులు పూర్తి కాలేదు. రైతు బంధు పథకానికి నిధుల కొరత రావడంతోనే.. చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అనేక జిల్లాల ట్రెజరీలలో ఇప్పుడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ముందుగా ఒక ఎకరం వరకు ఉన్న రైతులకు చెల్లింపులు జరిపి.. అనంతరం ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ నుంచి 17ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సంబంధించిన బిల్లులు, వివరాలు, బ్యాంకు అకౌంట్లు సమర్పించారు. కానీ ఏడెకరాల వరకు ఉన్న రైతులకే చెల్లింపులను జరిపారు. ఆ తర్వాత ఇక 2 వారాలుగా చెల్లింపులు నిలిపివేశారు.
చెల్లింపులపై రైతుల నుంచి విమర్శలు వస్తుండటంతో.. బ్యాంకులకు సెలవులు ఉండటంతోనే రైతుబంధు చెల్లింపులకు విరామం ఇచ్చామని వారం రోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. అయితే బ్యాంకులకు కేవలం 4 రోజులు మాత్రమే సెలవులు కాగా.. నిధుల కొరతే చెల్లింపుల్లో జాప్యం జరగడానికి అసలు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.