Sania Mirza : సానియా మీర్జా సంచలన నిర్ణయం..టెన్నిస్ కు వీడ్కోలు..!
Sania Mirza : భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకుంది. 2022 సీజన్ తర్వాత టెన్నిస్ ఆట నుంచి తను పూర్తిగా రిటైర్ కాబోతున్నట్లు ప్రకటించి.. తన అభిమానులను షాక్ కు గురి చేసింది.ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఓటమి చెందిన అనంతరం సానియా ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
2022 సీజన్ తర్వాత ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు పేర్కొంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలోనే పాక్క్రికెటర్ షోయాబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సానియా…. అనంతరం కొంతకాలం క్రీడలకు దూరంగా ఉంటూ తన పిల్లలు, కుటుంబంతోనే గడుపుతున్నారు.

Sania Mirza announced her Retirement in tennis game
అయితే ఇటీవల 2021లో తిరిగి ఆటలో ప్రవేశించారు. ఇక తమ అభిమాన క్రీడాకారిణి సానియా తిరిగి మళ్లీ ఆటలో పుంజుకుని తమను అలరిస్తుందనుకుంటున్న తరుణంలో ఇలా రిటైర్ అవుతున్నానని ప్రకటించడంతో ఇప్పుడు వారంతా నిరాశకు లోనవుతున్నారు.