Success Story : 106 వ్యర్ధం నుండి రూ.75 కోట్ల రాబడి.. ఇలాంటి ఆలోచనలు ఎలా?
ప్రధానాంశాలు:
Success Story : 106 వ్యర్ధం నుండి రూ.75 కోట్ల రాబడి.. ఇలాంటి ఆలోచనలు ఎలా?
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని చాలా మంది ఆలోచనలు చేస్తున్నారు. ఇదే క్రమంలో చెన్నై కేంద్రంగా గ్లోబల్ గ్రీన్ కోయర్ స్థాపించిన అనీస్ అహ్మద్ సక్సెస్ స్టోరీ ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఆయన కొబ్బరికాయల నుంచి వచ్చే వృధాతో వివిధ ఉత్పత్తులను తయారు చేసి ఏకంగా రూ.75 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాడు. అనీస్ ప్రారంభించిన స్టార్టప్ కంపెనీ వ్యవసాయ అవశేషాలను కోకోపీట్‌గా ప్రాసెస్ చేస్తూ పర్యావరణ అనుకూలమైన నేల ప్రత్యామ్నాయంగా మార్చారు.
Success Story సక్సెస్ స్టోరీ..
కోకోపీట్ తయారు చేయడానికి, ముందుగా ఎండిపోయిన కొబ్బరికాయలను తీసుకోండి. దాని పై తొక్క తీసి దాని నుండి కొబ్బరిని వేరు చేయండి. కొబ్బరి పీచును చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీపట్టుకోవాలి. హోం గార్డెన్‌లో కోకోపీట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. కోకో పీట్ మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మొక్కలో నీటిని నిలుపుకోవడానికి, మూలాలకు మంచి గాలిని అందిస్తుంది. కోకోపీట్‌లో పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. కంపోస్ట్ లేదా సేంద్రీయ ఎరువుతో కోకోపీట్ కలపడం మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. మొక్కకు వేసే మట్టితో కోకోపీట్ కలపడం తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. కోకోపీట్ ఉత్పత్తిలో భారతదేశపు అగ్రగామిగా ఉన్న తమిళనాడు.. ప్రపంచ మార్కెట్లకు గణనీయమైన వాటాను సరఫరా చేస్తోంది.
2 గ్లోబల్ గ్రీన్ కోయిర్ ఒక సాధారణ, వినూత్నమైన ఆలోచనతో ప్రారంభమైంది. వ్యర్థాలను ఉపయోగపడే ఉత్పత్తుల మార్చి అంతర్జాతీయంగా వీటిని సరఫరా చేయాలని అనీస్ అహ్మద్ భావించారు. అలా అనీస్ తమిళనాడు కొబ్బరి పరిశ్రమ అన్‌టాప్ చేయని సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అధిక-నాణ్యత కోకోపీట్‌ను రూపొందించగా వాటికి భారీగా డిమాండ్ ఉంది. అలా యూరప్ సహా అనేక దేశాలకు ఈ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఏడాదికి రూ.75 కోట్ల విలువైన వ్యాపారాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా కొబ్బరికాయ పై తోలును స్థానిక పొలాల నుంచి సేకరించి, ఫైబర్లు, ఆకులు వంటి మలినాలను తొలగించిన తర్వాత సరైన తేమ స్థాయిలకు తీసుకొచ్చి ప్యాక్ చేస్తారు.