ChandraBabu : ఓటమి భయంతో ఎట్టకేలకు అక్కడ సొంత ఇళ్లు కట్టుకుంటున్న చంద్రబాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ChandraBabu : ఓటమి భయంతో ఎట్టకేలకు అక్కడ సొంత ఇళ్లు కట్టుకుంటున్న చంద్రబాబు

ChandraBabu : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త రాజకీయం మొదలు పెట్టాడు. సుదీర్ఘ కాలంగా చిత్తూరు జిల్లా కుప్పం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు అక్కడ కనీసం సొంత ఇల్లును ఏర్పాటు చేసుకోలేదు. కుప్పంకు వెళ్లిన ప్రతిసారి కూడా అక్కడ ప్రైవేట్‌ హోటల్ లేదా.. గెస్ట్‌ హౌస్‌ లో ఉంటున్నాడు. సొంత గ్రామం నారావారి పల్లె లో తన పూర్వీకుల ఇల్లు ఉండటం వల్ల అప్పుడప్పుడు అక్కడకు వెళ్తున్నాడు. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :29 June 2022,7:00 am

ChandraBabu : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త రాజకీయం మొదలు పెట్టాడు. సుదీర్ఘ కాలంగా చిత్తూరు జిల్లా కుప్పం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు అక్కడ కనీసం సొంత ఇల్లును ఏర్పాటు చేసుకోలేదు. కుప్పంకు వెళ్లిన ప్రతిసారి కూడా అక్కడ ప్రైవేట్‌ హోటల్ లేదా.. గెస్ట్‌ హౌస్‌ లో ఉంటున్నాడు. సొంత గ్రామం నారావారి పల్లె లో తన పూర్వీకుల ఇల్లు ఉండటం వల్ల అప్పుడప్పుడు అక్కడకు వెళ్తున్నాడు. కుప్పంలో తనకంటూ సొంత ఇల్లు అక్కడ లేకపోవడంతో ఇప్పుడు అక్కడి జనాల్లో వ్యతిరేకత వస్తుంది.

జాతీయ రాజకీయాలు అంటూ ఢిల్లీ వరకు వెళ్తున్న చంద్రబాబు నాయుడుకు ఆయన సొంత నియోజక వర్గం చూసుకునేందుకు సమయం దొరకడం లేదు అంటూ వారు అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తి మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల్లో చూపించారు. కుప్పం నియోజక వర్గం చేజారుతుందా అన్నట్లుగా మున్సిపల్‌ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ మున్సిపల్‌ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు..  మరియు సీట్ల కారనంగానే వెంటనే చంద్రబాబు నాయుడు తన సొంత ఇంటి నిర్మాణంను కుప్పంలో మొదలు పెట్టాడని..

tdp president n chandraBabu building a house in kuppam town

tdp president n chandraBabu building a house in kuppam town

ఇక నుండి రెగ్యులర్ గా కుప్పంకు వస్తాను.. అభివృద్ది కార్యక్రమాలను నిర్వహిస్తాను అంటూ వారికి హామీలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంతగా హామీ లు ఇచ్చినా కూడా.. సొంత ఇల్లు నిర్మాణం చేసుకున్నా కూడా అక్కడ చంద్రబాబు కు ఓటమి భయం తప్పదు అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ గననీయంగా తగ్గడం మాత్రమే కాకుండా ఓడిపోయే అవకాశాలు కూడా లేక పోలేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వైకాపా అక్కడ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది