Union Budget : వాహనదారులకి కేంద్రం కోలుకోలేని షాక్ ఇవ్వనుందా.. అసలు ఏం జరగనుంది?
Union Budget : 2022-23కు సంబంధించి ఈ మంగళవారమే బడ్జెట్ ప్రవేశపెట్టనంది కేంద్రం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే ఈ సారి కూడా బడ్జెట్‌పై పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తిగా పేపర్‌లెస్‌గా ఈ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. అటు కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితులు, ఇటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేయనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ నెలలో ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. అయితే ఇది తక్కువని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ రాకముందటితో పోలిస్తే..ప్రస్తుతం ఎక్సైజ్ సుంకం ఎక్కువగానే ఉందని చెబుతున్నారు.
ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించకపోవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ భాస్కర్ నివేదిక అంచనా వేస్తోంది. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సుంకాలను తగ్గించొచ్చని భావిస్తున్నారు. కాగా మోదీ సర్కార్ బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. రేపటితో పెట్రోల్ డీజిల్ సుంకాలపై ఒక స్పష్టత వస్తుంది.అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఇది కూడా డిడక్షన్ పరిమితిని పెంచేందుకు దోహదం చేయొచ్చని ఆర్థిక సేవలు అందించే ‘విలియమ్ ఓ నెయిల్’ అనే సంస్థ అంచనా వేసింది.
నిజానికి బడ్జెట్ 2021లో ఆర్థిక మంత్రి సరికొత్త పన్ను విధానాన్ని అమలు చేశారు. అయితే దీని వల్ల వేతన జీవులకు పెద్దగా ఊరట లభించలేదు. కొత్త విధానాన్ని తెచ్చినప్పటికీ.. పాత విధానాన్ని కూడా ప్రభుత్వంత అమలు చేస్తోంది. ఏ విధానం కావాలో ఎంచుకునే వెసులుబాటు మాత్రం పన్ను చెల్లింపుదారుల ఇష్టమేనని స్పష్టత ఇచ్చింది. దీనితో చాలా మంది పాత పన్ను విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉందో ప్రతిబింబించే ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆవిష్కరించనుంది.