Taraka Ratna : ఎక్మో వాడినా తారకరత్నని ఎందుకు బ్రతికించుకోలేకపోయాం ?
Taraka Ratna : తారకరత్న గుండెపోటుకు గురై గత 23 రోజులుగా బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. దాదాపుగా 22 రోజులు ఎక్నో మిషన్ మీదనే ఉన్నాడు తారకరత్న. గుండెపోటు వచ్చినప్పుడు కాలేయం, గుండెను పనిచేయించడానికి ఈ మిషన్ ని వాడతారు. కోవిడ్ సమయంలో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి ఇదే మిషన్ ను వాడారు. కానీ వాళ్ళ వయసు ఎక్కువ అవ్వడం వలన అవయవాలు సహకరించకపోవడం వల్ల కన్నుమూశారు.
కానీ తారకరత్న వయసు 45 ఏళ్ల లోపే అయిన అవయవాలు సహకరించకపోవడం వలన మృతి చెందారు. తారకరత్న గుండెపోటుకు గురైనప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు గంటసేపటిదాకా అతడికి మెరుగైన వైద్యం అందలేదు. ఒకవేళ అదే టైంలో వైద్యం అంది ఉంటే తారకరత్న బతికేవాడు. కుప్పం నుంచి బెంగళూరు తీసుకొచ్చేదాకా సమయం మించి పోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. అప్పటికి వైద్యులు ఒకరోజు గడిచిన తర్వాత ఎక్మో ద్వారా గుండె, కాలేయం పనిచేసేలా చేశారు. కానీ మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడం, ఎన్ని మందులు వాడినప్పటికీ శరీరం సహకరించకపోవడంతో తారకరత్న 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు.
తారకరత్నను బతికించేందుకు విదేశాల నుంచి వైద్యులను తప్పించారు. ఖరీదైన మందులు వాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మెదడు పూర్తిగా దెబ్బ తినడంతో డాక్టర్లు కూడా ఏం చేయలేకపోయారు. ఎక్నో మిషన్ కృత్రిమంగా గుండె, కాలేయానికి సపోర్ట్ అందిస్తుంది. గుండె, కాలేయం విఫలమై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ టెక్నాలజీ ద్వారా సపోర్ట్ అందిస్తారు. ఈ పద్ధతిలో శరీరం నుంచి బ్లడ్ తీసుకొని మిషన్ సహాయంతో రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉన్న కార్బన్డయాక్సైడ్ ని తొలగించి ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ అందిస్తారు. కోవిడ్ సమయంలో న్యూమోనియాతో బాధపడుతూ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సరిగా ఉండేందుకు, వెంటిలేషన్ సరిపోని రోగులకు దీనిని వాడేవారు.