Ramoji Rao : వదిలే ప్రసక్తే లేదు.. రామోజీరావు గుండెల్లో నిద్రపోతోన్న ఉండవల్లి అరుణ్ కుమార్.. మార్గదర్శి కేసులో కీలక విజయం దిశగా?
Ramoji Rao : మార్గదర్శి కేసు ఈనాడు చైర్మన్ రామోజీ రావు మెడకు చుట్టుకున్న విషయం తెలిసిందే. అసలు మార్గదర్శి చిట్ ఫంట్స్ రామోజీరావుదేనా కాదా.. అనే విషయం కూడా త్వరలోనే తేలుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. రామోజీ రావుకు సంబంధించిన అన్ని విషయాల్లో త్వరలోనే తాను ఓ పుస్తకం రాస్తున్నానని, అందులో అన్ని వివరాలు పొందుపరుస్తానని చెప్పుకొచ్చారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ విషయాలు వెల్లడించారు. నిజానికి.. రిజర్వ్ బ్యాంకు రూల్స్ ప్రకారం.. రామోజీ రావు చిట్ ఫండ్ వ్యాపారం చేయడం కుదరదన్నారు.
కానీ.. ఆ నిబంధనలను పక్కన పెట్టిన రామోజీ రావు.. తనకు ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారాలు చేస్తున్నారన్నారు. చాలామంది చిట్ ఫండ్ పేరుతో వ్యాపారాలు నిర్వహించి ఆ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని, రామోజీ రావు విషయంలోనూ అదే జరిగిందన్నారు. మార్గదర్శి కేసు విచారణలో భాగంగా రామోజీ రావు ఒకసారి చిట్ ఫండ్స్ తనదే అని, మరోసారి తనది కాదని అన్నారని.. కోర్టులోనే ఈ విషయం రామోజీ చెప్పినట్టు ఉండవల్లి గుర్తు చేశారు. రామోజీరావుతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని మార్గదర్శి యాజమాన్యం కూడా చెప్పిన విషయాన్ని ఈసందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.
Ramoji Rao : చిట్ ఫండ్ సంస్థ రామోజీదా? కాదా?
అలాంటప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్యాలెన్స్ షీటుపై రామోజీరావు సంతకం ఎందుకు ఉంది అంటూ ప్రశ్నించారు. అందుకే.. అసలు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఎవరిది? రామోజీదేనా కాదా.. అనే విషయం ముందు తేలాలన్నారు. అందుకే.. మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారాలపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని ఉండవల్లి చెప్పారు. అసలు విషయాలు బయటపడాలంటే.. ముందు ప్రభుత్వం దృష్టి పెట్టాలని అప్పుడే సంచలన విషయాలు బయటికి వస్తాయన్నారు. చూద్దాం మరి.. మార్గదర్శి కేసులో ఇంకెన్ని నిజాలు బయటికి రానున్నాయో.