Youtube : మీకు యూట్యూబ్ చానెల్ ఉందా? అయితే మీకు బ్యాడ్ న్యూస్? మే 31 లోగా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Youtube : మీకు యూట్యూబ్ చానెల్ ఉందా? అయితే మీకు బ్యాడ్ న్యూస్? మే 31 లోగా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :13 March 2021,9:16 am

Youtube : యూట్యూబ్ తెలుసు కదా. ఒకప్పుడు యూట్యూబ్ అంటే కేవలం వీడియోలు చూడటానికే అని అనుకునేవాళ్లం. యూట్యూబ్ లో ఉన్న అన్ని వీడియోలను చూడటానికి మన లైఫ్ టైమ్ కూడా సరిపోదట. అన్ని వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ సర్వర్ లో. అయితే.. ప్రస్తుత జనరేషన్ లో యూట్యూబ్ నే తమ ఆదాయ వనరుగా మార్చుకుంటన్నారు నేటి యువత. యూట్యూబ్ లో చానెళ్లు క్రియేట్ చేయడం.. తమకు నచ్చిన కంటెంట్ ను పోస్ట్ చేయడం.. ఇదే వాళ్లకు పరిపాటి అయింది. యూట్యూబ్ వీడియోలకు వచ్చే పాపులారిటీని బట్టి డబ్బులు కూడా బాగానే వస్తుండటంతో చాలామంది యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Youtube youtube gives big shock to youtube channel owners over payments

Youtube : youtube gives big shock to youtube channel owners over payments

యూట్యూబ్ చానెల్ కు మానటైజేషన్ ఓకే అయితే చాలు.. ఆయా వీడియోల్లో యాడ్స్ ను యూట్యూబ్ డిస్ప్లే చేస్తుంది. యూజర్స్ ఆయా యాడ్స్ ను స్కిప్ చేయకుండా చూస్తే సదరు యూట్యూబ్ చానెల్ కు ఎక్కువ ఆదాయం వస్తుంది. అలాగే.. యూట్యూబ్ ప్రీమియం, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్లు, లైవ్, చానెల్ మెంబర్ షిప్ లాంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ద్వారా కూడా యూట్యూబ్ చానెళ్లకు డబ్బులు బాగానే వస్తున్నాయి.

మీకో విషయం తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ కు సుమారు రెండు బిలియన్ల మంది యూజర్లు ఉన్నారట. రెండు బిలియన్ల యూజర్లకు నచ్చే కంటెంట్ ను క్రియేట్ చేయగలిగితే ఎవ్వరైనా యూట్యూబ్ లో చానెల్ ను క్రియేట్ చేసుకోవచ్చు.

Youtube : యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయంపై ట్యాక్స్ వసూలు చేయనున్న యూట్యూబ్

ఇండియాలో ఎక్కువ మంది యూట్యూబ్ నే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకొని జీవిస్తున్నారు. అటువంటి వాళ్లందరికీ ప్రస్తుతం యూట్యూబ్ పెద్ద షాక్ ఇచ్చింది. బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు యూట్యూబ్ ద్వారా ఆర్జించిన ఆదాయంపై ట్యాక్స్ ను వసూలు చేయలేదు. కానీ.. ఇక నుంచి యూఎస్ నుంచి వచ్చే వ్యూయర్స్ ద్వారా వచ్చే ఆదాయంపై ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లించాల్సిందే.. అంటూ యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ స్పష్టం చేసింది. జూన్ 2021 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుందని గూగుల్ తెలిపింది.

దీనికి సంబంధించిన అప్ డేట్ గురించి యూట్యూబ్ చానెళ్ల నిర్వాహకులకు అందరికీ యూట్యూబ్ మెయిల్స్ పంపిస్తోంది. యూఎస్ ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ ప్రకారం.. యూట్యూబ్ యూఎస్ వ్యూస్ కు ట్యాక్స్ ను వేరే దేశాల యూట్యూబర్స్ చెల్లించాల్సి ఉంటుంది. దాని కోసం యూట్యూబర్స్ తన యాడ్ సెన్స్ అకౌంట్ లో ట్యాక్స్ కు సంబంధించిన వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.

మే 31 లోగా ట్యాక్స్ వివరాలను పొందుపరచాల్సిందే?

యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ.. మే 31లోగా తమ యాడ్ సెన్స్ అకౌంట్ లో ట్యాక్స్ కు సంబంధించిన వివరాలను పొందు పరచాల్సి ఉంటుంది. లేని పక్షంలో.. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంలో 24 శాతం కోత విధించే అవకాశం ఉంది. ఒక వేళ ట్యాక్స్ కు సంబంధించిన వివరాలను అందజేస్తే.. యూఎస్ వ్యూస్ ద్వారా వచ్చిన ఆదాయంలో సున్నా నుంచి 30 శాతం వరకు యూట్యూబ్ వారి ఆదాయాన్ని విత్ హెల్డ్ చేయనుంది. భారతదేశానికి చెందిన యూట్యూబ్ క్రియేటర్స్ కు మాత్రం విత్ హెల్డ్ రేటు.. యూఎస్ వ్యూస్ ఆదాయంలో 15 శాతం ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది