Ys Jagan : పొయినసారి ‘పీకే’ ఉన్నాడు కాబట్టి ఓకే… మరి ఈసారి..!

0
Advertisement

Ys Jagan : 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గొప్ప విజయాన్ని నమోదు చేసింది. దీనికి ఎన్నో అంశాలు తోడ్పడ్డాయి. తెలంగాణ లేని ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడికి ఒకసారి అవకాశం ఇచ్చాం కదా. అలాగే వైఎస్ జగన్ కి కూడా ఒక సారి ఛాన్స్ ఇచ్చిచూద్దాం అని జనం అనుకోవటం ఒక ప్లస్ పాయింట్. ప్రభుత్వ వ్యతిరేకత రెండో కలిసొచ్చిన అంశం. ప్రశాంత్ కిషోర్(పీకే) పొలిటికల్ స్ట్రాటజీ మూడో పాజిటివ్ పాయింట్. మొత్తానికి ముఖ్యమంత్రి కావాలనుకున్న వైఎస్ జగన్ కల నిజమై ఇప్పటికి రెండేళ్లు పూర్తయింది. 2024 శాసన సభ ఎలక్షన్ కి ఇంకా మూడేళ్ల సమయం మిగిలి ఉంది. లెక్కకే మూడేళ్లు గానీ చివరి ఏడాదిని ఎన్నికల సంవత్సరంగానే భావించాల్సి ఉంటుంది.

Ys Jagan
Ys Jagan

అయితే..

ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేయట్లేదు. డైరెక్టుగా రాజకీయాలే చేస్తున్నాడు. కేంద్రంలో మూడో ఫ్రంట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కి దూరంగా ఉంటున్నాడు. మరో రెండేళ్ల తర్వాత పొలిటికల్ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఇప్పుడున్న పరిణామాలను బట్టి చూస్తుంటే పీకే మళ్లీ వైఎస్ జగన్ కి సలహాలు సూచనలు ఇచ్చే కాంట్రాక్ట్ కుదుర్చుకోకపోవచ్చు. ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో అంత ఈజీగా గెలవటం కష్టమే అంటున్నారు.

పథకాలు పర్లేదు..

ysrcp party ap politics cm ys jagan
ysrcp party ap politics cm ys jagan

వైఎస్ జగన్ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మంచి పేరు తెచ్చిపెడుతున్నాయి. అవి చాలా వరకు ప్రభుత్వ వ్యతిరేకతను కవర్ చేస్తాయి. అయితే అధికార పార్టీకి ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మందిపై జనం సానుకూలంగా లేరని అంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల శాసన సభ్యులు కూడా అంత చురుకుగా పనిచేయలేదనే టాక్ వినిపిస్తోంది. కొవిడ్ థర్డ్ వేవ్ గనక తెర మీదికి వస్తే రూలింగ్ పార్టీకి ఇక రూకలు చెల్లినట్లే.

వీళ్లకేమైంది?..

prashant kishore
prashant kishore

కరోనా కట్టడిలో ప్రభుత్వ యంత్రాంగం బాగా పనిచేసింది. ప్రాణాలకు తెగించి పోరాడింది. ఎమ్మెల్యేలు మాత్రం ఆ స్థాయిలో కష్టపడలేదని, కనీసం ఇంట్లో నుంచి బయటికే రాలేదని జనం అంటున్నారు. కాబట్టి సిట్టింగ్ శాసన సభ్యులపై వ్యతిరేకత వైఎస్సార్సీపీని దెబ్బకొడుతుందని చెబుతున్నారు. ఇంకో ముఖ్యాంశం.. నాయకుల్లో వ్యక్తం కానున్న అసంతృప్తి. ఇప్పటికే చాలా మంది వైఎస్సార్సీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కానీ వాళ్లందరికీ బీఫాంలు ఇవ్వటం సాధ్యపడదు. అలాంటివాళ్లు ఇతర పార్టీల్లోకి వెళ్లి సొంత పార్టీని దెబ్బకొట్టే ప్రమాదం ఉంది. అందువల్ల వైఎస్ జగన్ విక్టరీ గతంలో మాదిరిగా ఈజీగా ఉండదని చెప్పొచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి ==> వైఎస్ జగన్ కి బీజేపీ ప్రయారిటీ… మోడీ ప్లాన్ ఇదే..?

ఇది కూడా చ‌ద‌వండి ==> మంత్రి వ‌ర్గంలో మార్పులు.. సీఎం జ‌గ‌న్ ప్లాన్ సూప‌ర్‌..!

ఇది కూడా చ‌ద‌వండి ==> వైఎస్సార్సీపీలోనే ‘‘తోట‘’ను టార్గెట్ చేస్తున్న‌రా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> చంద్రబాబు నాయుడు ఆ సువర్ణావకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నారా..?

Advertisement