Bro Movie First Review : బ్రో మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bro Movie First Review : బ్రో మూవీ రివ్యూ అండ్ రేటింగ్

 Authored By kranthi | The Telugu News | Updated on :27 July 2023,9:00 pm

Bro Movie First Review : ప్రస్తుతం తెలుగులో థియేటర్ కి వెళ్లి చూసే సినిమాలు అయితే లేవు. ఏవో చిన్న సినిమాలు విడుదలయ్యాయి కానీ.. అవి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు రాక చాలా రోజులు అవుతోంది. అసలు ఈ సంవత్సరం చూసుకుంటే కొన్ని వందల సినిమాలు విడుదలయ్యాయి కానీ.. సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు అంటే చేతుల మీద లెక్కపెట్టవచ్చు. కానీ.. బాక్సాఫీసు బద్ధలయ్యేలా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా థియేటర్ల ముందు సినిమా ప్రేక్షకులు క్యూ కట్టే రోజు వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan ముఖ్య పాత్రలో, సాయి ధరమ్ తేజ్ sai dharam tej ప్రధాన పాత్రలో నటించిన బ్రో సినిమా శుక్రవారమే థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా బెనిఫిట్ షోలు కూడా వేశారు. అయితే.. ఇదేదో కొత్త స్టోరీతో వస్తున్న సినిమా కాదు. తమిళంలో వచ్చిన వినోదయ సీతమ్ అనే సినిమాకు రీమేక్.

కాబట్టి ఈ సినిమాలో స్టోరీ ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టీజర్, ట్రైలర్ చూస్తే వినోదయ సీతమ్ సినిమా స్టోరీనే అచ్చు గుద్దినట్టు దించేసినట్టుగా అనిపిస్తోంది. తమిళ్ మూవీ వినోదయ సీతమ్ సినిమా చూసిన వాళ్లు బ్రో మూవీ ట్రైలర్ చూస్తే స్టోరీ ఏంటో ఇట్టే చెప్పేయొచ్చు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కి జోడీగా కేతిక శర్మ నటించింది. మరో పవర్ ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. డైలాగ్స్ కూడా ఆయనే రాశారు. ఈ సినిమా దర్శకత్వం వహించింది.. తమిళ్ వర్షన్ కు దర్శకత్వం వహించిన సముద్రఖని. తమిళంలో పవన్ కళ్యాణ్ పాత్రను సముద్రఖని పోషించారు.

Bro Movie First Review : కథ ఇదే

ఈ సినిమా కథ ఏంటంటే..ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మార్కండేయ అలియాస్ మార్క్ గా కనిపించనున్నారు. తన తండ్రి చనిపోవడంతో కంపెనీ బాధ్యతలను మార్క్ చూసుకుంటూ ఉంటాడు.24 గంటలు కంపెనీ కోసం ఆలోచిస్తూ ఉంటాడు. కంపెనీ కోసమే పని చేస్తుంటాడు. ప్రతి సారి టైమ్ లేదు.. టైమ్ లేదు అంటూ బిజీబిజీగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మార్క్. తన ఫ్యామిలీతో కూడా సరిగ్గా టైమ్ స్పెండ్ చేయడు. ఒక్క నిమిషం కూడా తన కుటుంబ సభ్యులతో గడపలేకపోతాడు మార్క్.

Bro Movie First Review Rating In Telugu

Bro Movie First Review Rating In Telugu

చివరకు తన లవర్ తో కూడా సరిగ్గా టైమ్ స్పెండ్ చేయలేకపోతాడు. దాని వల్ల తన లవర్ బ్రేకప్ చెప్పేస్తుంది. అదే సమయంలో మార్క్ కి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. దీంతో అతడు మరణిస్తాడు. అతడు మరణించిన తర్వాత తన ఫ్యామిలీ గుర్తొస్తుంది. తన తల్లి, చెల్లి, తమ్ముడు.. వీళ్లంతా ఏమౌతారు అని టెన్షన్ పడతాడు. అదే టైమ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు టైం.చనిపోయిన మార్క్ ను పైకి తీసుకెళ్లబోతుండగా తనను ఇంత త్వరగా ఎందుకు చంపారు. తనకు చాలా బాధ్యతలు ఉన్నాయని.. కొంత సమయం ఇస్తే తన బాధ్యతలను పూర్తి చేసుకొని వస్తా అని మార్క్.. టైమ్ ను కోరుతాడు. దీంతో సరే అని కొంత కాలం బతికే అవకాశం ఇస్తాడు టైమ్. అది కూడా 90 రోజులు మాత్రమే. కానీ.. నువ్వు బతికి ఉన్నన్ని రోజులు నేను నీతోనే ఉంటాను అనే ఒక కండిషన్ పెడతాడు టైమ్.

ఇన్ని రోజులు తన ఫ్యామిలీకి సమయం కేటాయించని మార్క్.. ఇంటికి వెళ్లి తన సోదరి, సోదరుడిని లైఫ్ లో సెటిల్ చేయాలని అనుకుంటాడు. కానీ.. వాళ్ల కెరీర్ లను వాళ్లే ముందే ప్లాన్ చేసుకుంటారు. ఒక వ్యక్తి ఉన్నా లేకున్నా.. ఎవరి జీవితం అయినా ముందుకెళ్తుందని.. ఒకరి జీవితం మరొకరి మీద ఆధారపడి ఉండదని.. ఎవరు ఉన్నా లేకున్నా.. ఎవ్వరి జీవితం వాళ్లదే. పైన దేవుడు ఎలా అనుకుంటే అలా ఆ జీవితం ముందుకు వెళ్లాల్సిందే అనే కాన్సెప్టే ఈ సినిమా. 90 రోజుల్లో తన ఫ్యామిలీని సెట్ చేస్తాడా? తనతో పాటే ఉన్న టైమ్ ఎవరో వాళ్లకు తెలుస్తుందా? మార్క్ చనిపోతాడని వాళ్లకు తెలుస్తుందా? అనేవి తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

Bro Movie First Review : విశ్లేషణ

ఒకరకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇందులో ఒక గెస్ట్ రోల్ అనే చెప్పుకోవాలి. మీకు గోపాల గోపాలా అనే సినిమా గుర్తుందా? ఆ సినిమాలో పవన్ ఎలా దేవుడి పాత్రలో కనిపించారో.. ఈ సినిమాలోనూ అలాగే కనిపిస్తారు. టైమ్ ప్రాణం పోసుకుంటే.. ఒక మనిషిలా మారితే ఎలా ఉంటుందో పవన్ అలా కనిపిస్తాడు. టైమ్ గా పవన్ కళ్యాణ్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. సాయి ధరమ్ తేజ్, పవన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పవన్ కళ్యాణ్ మేనరిజం, తన స్టయిల్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కేతిక శర్మ కూడా తన అందాలను ఆరబోసింది. మరో హీరోయిన్ గా నటించిన ప్రియ ప్రకాష్ వారియర్ కి నటించే స్కోప్ అంతగా లేదు. మిగితా నటీనటులు తమ పాత్ర మేరకు నటించారు. ఈ సినిమా మొత్తాన్ని సాయి ధరమ్ తేజ్ తన భుజాల మీద మోశారు. ఆయనకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా నిలిచారు అని చెప్పుకోవచ్చు.

ప్లస్ పాయింట్స్

పవన్ కళ్యాణ్ మేనరిజం

ఫస్ట్ హాఫ్

తక్కువ రన్ టైమ్

ఫన్

పవన్ హిట్ సాంగ్స్ సీన్స్

మైనస్ పాయింట్స్

కొన్ని బోరింగ్ సీన్స్

స్లో నరేషన్

ఒరిజినల్ ఫ్లేవర్ మిస్

చివరగా…

చివరగా ఈ సినిమా రీమేక్ అని అందరికీ తెలుసు. ఒరిజినల్ వినోదయ సీతమ్ సినిమా చూసి మాత్రం ఈ సినిమాకు వెళ్లకండి. మీకు అస్సలు ఈ సినిమా ఆసక్తిగా అనిపించదు. ఆ సినిమా చూడకపోతే.. ఈ సినిమాను థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. కానీ.. ఒరిజినల్ కి, ఈ సినిమా కథకి చాలా మార్పులు ఉన్నాయి. అయినా కూడా పవన్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరి కాంబోలో వచ్చిన బ్రో సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.

దితెలుగున్యూస్ రేటింగ్ : 2.75/5

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది