Dhamaka Movie Review : రవితేజ ‘ధమాకా’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్…!!

Advertisement

Dhamaka Movie Review : మాస్ మహారాజా రవితేజ, Mass Maharaja Ravi Teja, నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా, Dhamaka, కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 23, 2022 న శుక్రవారం విడుదలయింది. నిజానికి కోవిడ్ తర్వాత రవితేజ, Ravi Teja, నటించిన క్రాక్ మూవీ, Crack movie, బాక్సాఫీసు వద్ద రికార్డు క్రియేట్ చేసింది. క్రాక్ మూవీతో సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రవితేజ ఆ తర్వాత ఖిలాడీ, Khiladi, రామారావు ఆన్ డ్యూటీ, Rama Rao on duty అనే సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు అంతగా ఆడలేదు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో రవితేజ.. ధమాకా అంటూ థియేటర్లలోకి వచ్చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది. టీజర్, ట్రైలర్, పోస్టర్లు అన్నీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యాయి.

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువయ్యాయి.ఈ సినిమాలో రవితేజ, Ravi Teja, సరసన.. పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల, Sreeleela, నటించింది. అయితే.. ఈ సినిమాపై పలు ఆందోళనలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో తమను అవమానించారంటూ ఉప్పర కులస్తులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ వివాదం కూడా రిలీజ్ ముందే సమిసిపోయింది. ఇక.. ఈ సినిమా పాటలు మాత్రం నిజంగానే ధమాకా అన్నట్టుగా ఉన్నాయి. సినిమా పేరు : ధమాకా, నటీనటులు : రవితేజ, శ్రీలీల, జయరామ్, సచిన్ కేడెకర్, తనికెళ్ల భరణి, రావు రమేశ్, ఆలీ తదితరులు, డైరెక్టర్ : త్రినాథ రావు నక్కిన, ప్రొడ్యూసర్స్ : అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్ సిసిరోలియో, విడుదల తేదీ : 23 డిసెంబర్ 2022

Advertisement
Dhamaka Movie Review and rating telugu 
Dhamaka Movie Review and rating telugu

Dhamaka Movie Review : కథ

ఈ సినిమాలో రవితేజ పేరు ధమాకా స్వామి. ఇతడు ఒక మధ్యతరగతి కుర్రాడు. జీవితంలో ఎలాంటి లక్ష్యాలు లేని వ్యక్తి. కేవలం టైమ్ పాస్ చేస్తుంటాడు. ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటాడు. అలాగే.. ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. అయితే.. ఆమె అతడిని కాకుండా.. అతడిలాగానే ఉండే ఆనంద్ చక్రవర్తి(రవితేజ) అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. అతడు బిజినెస్ మ్యాన్. అప్పుడే అసలు ధమాకా మొదలవుతుంది. అసలు వీళ్లిద్దరూ ఎవరు. ఇద్దరూ ట్విన్సా.. లేక ఇద్దరు ఒకరినొకరు ముందే తెలుసా? ఇద్దరూ ఒకే అమ్మాయిని ఎందుకు ప్రేమించారు. చివరకు ఆ అమ్మాయి ఎవరికి దక్కుతుంది. అసలు.. ఇద్దరూ తమ జీవితాలను ఎందుకు మార్చుకున్నారు అనేదే మిగతా కథ.

Dhamaka Movie Review : సినిమా ఎలా ఉంది?

రవితేజ ఎనర్జిటిక్ పాత్రలకు పెట్టింది పేరు. అందుకే ఆయన్ను అందరూ మాస్ మహారాజా అని పిలుస్తారు. సినిమా మొత్తం మీద కేవలం రవితేజ ఎనర్జీని మనం చూడొచ్చు. అంత ఎనర్జీగా ఏ హీరో కూడా కనపించడు. అయితే.. ఈ సినిమా పక్కా కమర్షియల్ గా వచ్చింది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం అలా సరదాగా గడిచిపోతుంది. రవితేజ ఇంట్రడక్షన్, ఆ తర్వాత టైటిల్ సాంగ్.. ఆ తర్వాత కామెడీ సీన్స్, లవ్ ట్రాక్.. పక్కాగా కమర్షియల్ ఫార్మాట్ లో ఫస్ట్ హాఫ్ ముగిసిపోతుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొదలవుతుంది. అసలు కథ మొదలయ్యేది సెకండ్ హాఫ్ లోనే. సెకండ్ హాఫ్ లోనే రవితేజ ద్విపాత్రాభినయం గురించి తెలుస్తుంది. ఆ తర్వాత కథలో సీరియస్ నెస్ వస్తుంది. తర్వాత కామెడీ ట్రాక్ కూడా బాగానే వర్కవుట్ అయింది. మొత్తానికి ఈ సినిమాను రవితేజ మాత్రం తన భుజాల మీద మోశాడు అని చెప్పుకోవాలి. ఇక.. పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల పర్వాలేదనిపించింది. ఏది ఏమైనా ఈ సినిమాలో రొటీన్ కథ ఉన్నప్పటికీ.. సినిమాలో ఉండే ట్విస్టులు, కామెడీ ప్రేక్షకులను అలరిస్తాయి.

దితెలుగున్యూస్ రేటింగ్ : 3/5

Advertisement
Advertisement