Kalki 2898 AD Movie Review : కల్కి మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందా.. సినిమాల ఎలా ఉందో తెలుసా ?
Kalki 2898 AD Movie Review : ప్రభాస్ Prabhas, నాగ్ అశ్విన్ Nag Ashwin కల్కి 2898 ఏడీ సినిమా Kalki Movie Review కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సబంధించి మేకర్స్ అన్ని ప్రమోషన్స్ పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన థీమ్ సాంగ్ ‘కల్కి’ గురించి ఎలివేషన్స్ ఇస్తూ సాగింది. పురాణాల గురించి దేవుని అవతారాల గురించి వర్ణిస్తూ ఈ సాంగ్ సాగింది. దీంతో ఈ సాంగ్‌లోని సినిమా […]
Kalki 2898 AD Movie Review : ప్రభాస్ Prabhas, నాగ్ అశ్విన్ Nag Ashwin కల్కి 2898 ఏడీ సినిమా Kalki Movie Review కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సబంధించి మేకర్స్ అన్ని ప్రమోషన్స్ పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన థీమ్ సాంగ్ ‘కల్కి’ గురించి ఎలివేషన్స్ ఇస్తూ సాగింది. పురాణాల గురించి దేవుని అవతారాల గురించి వర్ణిస్తూ ఈ సాంగ్ సాగింది. దీంతో ఈ సాంగ్‌లోని సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చేశారు. సినిమా పూర్తి కథని ఈ సాంగ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు అనేలా ఈ సాంగ్ సాగింది.ఇక సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది , ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ టికెట్ల కోసం సోషల్ మీడియాలో ఏ రేంజ్ డిస్కషన్స్ నడుస్తున్నాయో అందరికీ తెలిసిందే.
Kalki 2898 AD Movie Review అంచనాలు మించి..
‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ సినిమాని చూడాలని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మేకర్స్ తమ సన్నిహితులకు స్పెషల్ షో వేయడం జరిగింది. సినిమా చూసిన వారిలో కొంతమంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాలో 9 రకాల యుద్దాలకి సంబంధించిన ఎపిసోడ్స్ ఉంటాయట. కలియుగంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి.. ‘కల్కి..’ ఎలా వస్తాడు? అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుందని అంటున్నారు. చిత్రంలో విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. ఇక కథలో భాగంగా వచ్చే బిట్ సాంగ్స్ కూడా గూంజ్ బంప్స్ తెప్పిస్తాయట.
ప్రభాస్ డైనమిక్ ప్రెజెన్స్ హైలెట్ అని.. క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్స్ సర్ప్రైజింగ్ గా అనిపిస్తాయని అంటున్నారు. మొత్తంగా ‘కల్కి..’ సినిమా ఓ గొప్ప అనుభూతి ఇస్తుందని, సినిమా చూసే వారు తప్పక థ్రిల్‌గా ఫీలవుతారని అంటున్నారు. స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, హాట్ కేకుల్లా సేల్ అయిపోయాయి. ఈ క్రమంలోనే మూవీపై, తొలిరోజు కలెక్షన్స్‌పై అంచనాలు ఓ రేంజులో పెరిగిపోతున్నాయి.