Eagle Movie Review : రవితేజ ఈగల్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Eagle Movie Review : రవితేజ ఈగల్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Eagle Movie Review : ఈగల్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ టాలీవుడ్ Tollywood లో మాస్ హీరోగా తనదైన ముద్ర వేసుకుని వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు మాస్ మహారాజా రవితేజ Ravi Teja . రిజల్ట్ తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులు చేసుకుంటూ పోతున్నాడు. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక తాజాగా ఆయన నటించిన సినిమా ‘ ఈగల్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :8 February 2024,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Eagle Movie Review : రవితేజ ఈగల్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Cast & Crew

  • Hero : రవితేజ
  • Heroine : Anupama Parameswaran
  • Cast : రవితేజ , Anupama Parameswaran, ‎Kavya Thapar, ‎Navdeep
  • Director : ‎Karthik Gattamnen
  • Producer : T. G. Vishwa Prasad and Vivek Kuchibhotla
  • Music : Davzand
  • Cinematography : Kamil Plocki ,Karm Chawla

Eagle Movie Review : ఈగల్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ టాలీవుడ్ Tollywood లో మాస్ హీరోగా తనదైన ముద్ర వేసుకుని వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు మాస్ మహారాజా రవితేజ Ravi Teja . రిజల్ట్ తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులు చేసుకుంటూ పోతున్నాడు. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక తాజాగా ఆయన నటించిన సినిమా ‘ ఈగల్ ‘ . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. దవ్ జాంద్ సంగీతం అందించారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, వినయ్ రాయ్, మధుబాల కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా ఫుల్ లెన్త్ యాక్షన్ తో రూపొందింది. దీనికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని సైతం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

Ravi Teja రవితేజ ఈగల్ మూవీ రివ్యూ

ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈగల్ సినిమా అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఫిబ్రవరి 9న విడుదల కాబోతుంది. ఇక ఇటీవల ఈ సినిమాని సెన్సార్ సభ్యులు వీక్షించినట్లు తెలిసింది. ఈ సినిమా 2 గంటల 38 నిమిషాల పాటు ఉండబోతుందని తెలిసింది. ఇక ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు ఫిదా అయ్యారట. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయేలా ఉందని చెప్పారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అలాగే ఈ సినిమాకి హీరో రవితేజ కూడా రివ్యూ ఇచ్చారు. తాజాగా ఈ సినిమాను మాస్ మహారాజా రవితేజ స్పెషల్ స్క్రీనింగ్ లో వీక్షించాడు. రవితేజ తో పాటు దర్శకుడు, నిర్మాత, ఇతర సభ్యులు కొంతమంది సినిమాను చూశారు. ఈగల్ చూసిన తర్వాత రవితేజ ఫుల్ ఎక్సైట్ అయ్యాడు. ఫుల్ సాటిస్ఫైడ్ అంటూ ఒక్క మాటలో తన సినిమా మీద రివ్యూ ఇచ్చేసుకున్నాడు. చాలా బాగుంది అన్నట్టుగా రవితేజ చెప్పకనే చెప్పేశాడు.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాదు ఫస్ట్ కాపీని చూసిన తర్వాత అతను సంతృప్తి వ్యక్తం చేశాడు. దర్శకుడు కార్తీక్ ను హత్తుకుని రవితేజ నేను చాలా సంతృప్తిగా ఉన్నాను అని రివ్యూ ఇచ్చేశాడు. దర్శక నిర్మాతలు కూడా ఫుల్ ఖుషి గానే కనిపిస్తున్నారు. ఇలా మొత్తానికి ఈగల్ ఫస్ట్ రివ్యూ మాత్రం రవితేజ నోటి నుంచే వచ్చేసింది. ఇది చూసిన రవితేజ అభిమానులు ఖుషి అవుతున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఈగల్ సినిమా ఫిబ్రవరి 9 విడుదల కాబోతుంది. ఈ సినిమాకి పోటీగా పెద్ద సినిమాలేవి లేవు. కాబట్టి ఈగల్ కి వీలైనంత థియేటర్లు దక్కుతాయి. ఫస్ట్ డే నుంచి మంచి రికార్డులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈగల్ కు కాస్త పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు కొట్టేయడం రవితేజకు పెద్ద పని కాదు.

Ravi Teja రవితేజ ఈగల్ మూవీ రివ్యూ కథ :-

ఈ సినిమాలో సహదేవ వర్మ ( రవితేజ ) అడవి ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. ఆయన చుట్టుపక్కల ఏం అన్యాయం జరిగినా కూడా తను రియాక్ట్ అవుతూ తన అనుకునే వాళ్లను కాపాడుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలోనే కొంతమంది పోలీసులు రవితేజను అడవి నుంచి బయటికి తీసుకురావాలి అని కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్లు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో రవితేజ అడవి నుంచి బయటికి వస్తే అతని అరెస్టు చేయాలని పోలీసులు చూస్తుంటారు. రవితేజ కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు..? ఆయన గత చరిత్ర ఏంటి అని సస్పెన్షన్..

Eagle Movie Review రవితేజ ఈగల్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్

Eagle Movie Review : రవితేజ ఈగల్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Ravi Teja రవితేజ ఈగల్ మూవీ రివ్యూ విశ్లేషణ :-

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న స్టోరీ బావుంది. అలాగే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా చాలా వరకు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. దానికి తగ్గట్టుగానే డైలాగులు గాని సాంగ్స్ గాని డిజైన్ చేయించుకున్న విధానం అద్భుతమని చెప్పాలి. ఇక ఈ కథకి రవితేజని ఎంచుకొని కూడా దర్శకుడు ఒక మంచి పని చేశాడు. ఎక్కువగా యాక్షన్ పార్ట్ ని నమ్ముకొని ముందుకు వెళ్లాడు. కథపరంగా అక్కడక్కడ కొంచెం లూప్ హోల్స్ ఉన్నప్పటికీ రవితేజ తన నటనతో ఆ సినిమా చూసే ప్రేక్షకుడికి అవి గుర్తు లేకుండా మేనేజ్ చేస్తూ వచ్చాడు..ఇక కొన్ని సీన్లలో అయితే రవితేజ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. డైరెక్టర్ రాసుకున్న బలమైన సీన్లకి రవితేజ యాక్టింగ్ ద్వారా ప్రాణం పోశాడు. సినిమా చూసే ప్రేక్షకుడిని రవితేజ కొన్ని సందర్భాల్లో ఏడిపిస్తాడు. ఇక ఫస్టాఫ్ కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం అసలైన స్టోరీ ఏంటనేది చూపించాడు. ఇక ప్రతి క్యారెక్టర్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ క్యారెక్టర్ తరపు డిజైనింగ్ అనేది క్లారిటీగా చేసుకుంటూ వచ్చాడు. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాలో విజువల్స్ ని కూడా టాప్ నాచ్ లో చూపించాడు.

మహిబాబు కరణం రాసిన డైలాగ్స్ కూడా సినిమాలో ఎమోషన్స్ ని బాగా ఎలివేట్ చేశాయి. కరెక్ట్ గా ఏ టైంలో ఎలాంటి డైలాగ్ పడాలో అలాంటి డైలాగ్స్ రాసి సక్సెస్ అయ్యాడు. ఇక రవితేజ సినిమా భారం మొత్తాన్ని తన భుజాలపై మోసాడు. ప్రతి సీన్లో ఇంటెన్స్ పర్ఫామెన్స్ ఇస్తూ ఇంతకుముందు రవితేజ ఎప్పుడు కనబడని ఒక కొత్త వే లో తనని తాను మౌల్డ్ చేసుకొని మరి పెర్ఫార్మ్ చేశాడు. ఆయన యాక్టింగ్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇక ఆయనతోపాటు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధుబాల, శ్రీనివాస్ అవసరాల కావ్య థాపర్ లాంటి నటీనటులు వాళ్ల పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఇంతకుముందు లా కాకుండా ఒక కొత్త వేలో యాక్టింగ్ డెలివరీ చేసి సక్సెస్ అయ్యారు. ఇక టెక్నికల్ విషయంలో సినిమాటోగ్రాఫర్ ఒక్కరే అవ్వడం వల్ల ఈ సినిమా స్టోరీ ని ఎలాగైతే తాను ఇమేజెన్ చేసుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జంద్ ఈ సినిమాలో కొన్ని సీన్లను ఎలివేట్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఈ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్గా నిలిచింది. సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది.

• ప్లస్ పాయింట్స్ :-

రవితేజ యాక్టింగ్
డైరెక్షన్
యాక్షన్ సీన్స్
డైలాగ్స్
క్లైమాక్స్

• మైనస్ పాయింట్స్ :-

స్టోరీలో కొన్ని లూప్ హోల్స్
ఫస్ట్ హాఫ్ స్లో

Rating :

2.8/5

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది