The Warriorr Movie Review : ది వారియర్ మూవీ రివ్యూ & రేటింగ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

The Warriorr Movie Review : ది వారియర్ మూవీ రివ్యూ & రేటింగ్..!

The Warriorr Movie Review : ది వారియర్ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందు రామ్ పోతినేని వచ్చేశాడు. ఈరోజు అంటే జులై 14న ది వారియర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1300 థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే.. ఈ సినిమా ప్రీమియర్స్ రాత్రి వేయలేదు. ఇవాళ ఉదయం 9.30 కు మాత్రమే తొలి షోను స్టార్ట్ చేశారు. రామ్ సినిమాకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం అయితే ఇదే తొలిసారి. రామ్ కెరీర్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :14 July 2022,12:15 pm

The Warriorr Movie Review : ది వారియర్ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందు రామ్ పోతినేని వచ్చేశాడు. ఈరోజు అంటే జులై 14న ది వారియర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1300 థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే.. ఈ సినిమా ప్రీమియర్స్ రాత్రి వేయలేదు. ఇవాళ ఉదయం 9.30 కు మాత్రమే తొలి షోను స్టార్ట్ చేశారు. రామ్ సినిమాకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం అయితే ఇదే తొలిసారి. రామ్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలు, ట్రైలర్, టీజర్ సోషల్ మీడియాలో ఎంత ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే.. ఎనర్జిటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్.. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాగే.. తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఆ అంచనాలు కాస్త రెట్టింపు అయ్యాయి. రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. హలో బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్.. ఆన్ ది వేలో పాడుకుందాం డ్యుయెట్టు అంటూ వచ్చిన ఈ సినిమాలోకి పాట.. సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. మరి.. తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? రామ్.. మరోసారి తన ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? తెలుసుకోవాలంటే సినిమా కథేంటో తెలుసుకోవాల్సిందే.

The Warriorr Movie Review : సినిమా కథ ఇదే

ఈ సినిమాలో మూడు ప్రధాన పాత్రలు ఉంటాయి. వాటిలో ఒకటి రామ్ ది కాగా.. ఇంకొకటి కృతి శెట్టి. మరొకటి ఆది పినిశెట్టిది. కృతి శెట్టి ఈ సినిమాలో ఆర్జేగా నటించింది. తన పేరు విజిల్ మహాలక్ష్మి. రామ్ ఒక పోలీస్ ఆఫీసర్. డీఎస్పీ సత్య. విలన్ గా నటించిన ఆది పినిశెట్టి.. గురుగా నటించాడు. డీఎస్పీ సత్య పేరు చెబితే రౌడీల గుండెల్లో వణుకు పుడుతుంది. సత్య సక్సెస్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. అతడిని డీఎస్పీగా ప్రమోట్ చేయడంతో కర్నూలుకు బదిలీ అవుతాడు. కర్నూలు మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని అక్కడ చీమ చిటుక్కుమనాలన్నా గురు అనుమతి కావాల్సిందే. అతడో పెద్ద గ్యాంగ్ స్టర్. మరోవైపు సత్య.. విజిల్ మహాలక్ష్మిని కలుస్తాడు. తను రేడియో జాకీ. ఇద్దరూ కలిసి.. కర్నూలులో గురు చేస్తున్న చట్టవిరుద్ధ పనులను ఆపేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే.. తను పోలీస్ అనే విషయం మహాలక్ష్మికి తెలియదు. ఆ తర్వాత మహాలక్ష్మికి సత్య.. పోలీస్ అని తెలుస్తుంది. సత్య, మహాలక్ష్మి గురించి గురుకు తెలిసి ఏం చేస్తాడు? అసలు మహాలక్ష్మికి, గురుకు ఉన్న సంబంధం ఏంటి? సత్య.. గురును ఎందుకు పట్టుకోవాలనుకుంటాడు? అనే విషయం తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

The Warriorr Movie Review and Rating in Telugu

The Warriorr Movie Review and Rating in Telugu

The Warriorr Movie Review : సినిమా పేరు : ది వారియర్

నటీనటులు : రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా తదితరులు
దర్శకత్వం : ఎన్ లింగుస్వామి
నిర్మాత : శ్రీనివాస చిట్టూరి
ఎడిటర్ : నవీన్ నూలి
మ్యూజిక్ డైరెక్టర్ : దేవిశ్రీప్రసాద్
రిలీజ్ డేట్ : 14 జులై 2022
విడుదలయిన భాషలు : తెలుగు, తమిళం
రన్నింగ్ టైమ్ : 155 నిమిషాలు(2 గంటల 35 నిమిషాలు)

The Warriorr Movie Review సినిమా విశ్లేషణ

ఒకరకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా పోలీస్ డ్రామా. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్. సెకండ్ హాఫ్ లో సత్య, గురు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. హీరోయిక్ మూమెంట్స్ కావచ్చు.. విలన్ ఎలివేషన్స్ కావచ్చు.. ఎమోషన్స్ అన్ని సినిమాకు కరెక్ట్ గా సరిపోయాయి. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి విడుదల కావడంతో.. అటు తెలుగు, ఇటు తమిళం.. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను మలిచాడు లింగుస్వామి. విజిల్ విజిల్, బుల్లెట్ పాట కూడా వెండి తెర మీద అదిరిపోయాయి. ప్రేక్షకులు విజిల్ వేయకుండా ఉండలేకపోతున్నారు. మాస్ ఆడియెన్స్ కు ఆ పాటలు తెగ నచ్చుతున్నాయి.
ప్లస్ పాయింట్స్
రామ్, ఆది మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు
ఇంటర్వెల్ ట్విస్ట్
యాక్షన్ సీన్స్
రామ్, కృతి శెట్టి డ్యాన్స్
మైనస్ పాయింట్స్
ల్యాగ్ అయిన సెకండ్ హాఫ్
కన్ క్లూజన్
ఫైనల్ గా చెప్పొచ్చేదేంటంటే.. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాను ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే.. రామ్ ఎనర్జిటిక్ పర్ ఫార్మెన్స్ కావచ్చు.. ఆయన పవర్ ఫుల్ పోలీస్ పాత్ర, డ్యాన్స్ అన్నీ మాస్ ప్రేక్షకులకు నచ్చుతాయి.
ది తెలుగు న్యూస్ రేటింగ్ : 3.5/5

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది