vakeel saab USA public talk : వకీల్ సాబ్ USA పబ్లిక్ టాక్.. ఎన్ని హైలెట్స్ ఉన్నాయో చూడండి..!
vakeel saab USA public talk : వకీల్ సాబ్.. ప్రస్తుతం దేశ విదేశాలలో అందరిలోనూ ఇదే ఫీవర్ పట్టుకుంది. కరోనా కంటే వకీల్ సాబ్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యాడు. పవన్ అభిమానులు మాత్రమే కాదు ప్రతీ ప్రేక్షకుడు నోటి వెంట వినిపిస్తున్న మాట వకీల్ సాబ్. అజ్ఞాతవాసి సినిమా తర్వాత అసలు పవన్ కళ్యాణ్ సినిమాలే చేయనని చెప్పి షాకిచ్చాడు. ఈ మాట విని తట్టుకోలేపోయిన వాళ్ళెందరో చెప్పడానికి లెక్కలేదు. ఎక్కడ కనిపించినా పవన్ ని అడిగింది ఒకే ఒక్క మాట.. పవన్ మళ్ళీ సినిమా చేయాలని. అందుకే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా చేయాలనుకున్నాడు.
గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదీ కూడా ఒకటి రెండు సినిమాలు కాదు ఏకంగా ఆరు సినిమాలు. వాటిలో ముందు వస్తుంది వకీల్ సాబ్. సమాజంలో ఆడపిల్లల మీద జరుగుతున్న ఆకృత్యాలను..అఘాయిత్యాలను ఇతి వృత్తంగా తీసుకొని తెరకెక్కించిందే వకీల్ సాబ్. బాలీవుడ్, కోలీవుడ్ లో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. అలాంటి సినిమా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి కరెక్టా కాదా అన్న డైలమాలో నుంచి ఇలాంటి సినిమానే పవర్ స్టార్ చేయాల్సిన రీ ఎంట్రీ సినిమా అని ప్రతీ ఒక్కరు చెప్పుకునేలా దిల్ రాజు అండ్ వేణు శ్రీరాం అంచనాలు పెంచారు.
vakeel saab USA public talk : ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమా రేంజ్ ఊహించని విధంగా పెంచాయని పబ్లిక్ టాక్.
ఆ అంచనాలను అందుకుందని భారీ హిట్ వకీల్ సాబ్ దక్కించుకుందన్న మాట యూఎస్ లో ప్రీమియర్ షోస్ చూసిన వాళ్ళు చెబుతున్నారట. పవన్ కళ్యాణ్ ఇంటర్డక్షన్ సీన్ హై ఓల్టేజ్ తో ఉందట. వేణు శ్రీరాం ప్రతీ ఫేం ని అద్భుతంగా తెరకెక్కించాడట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సత్యమేవ జయతే, కంటి పాప సాంగ్స్ ఫస్ట్ ఆఫ్‌లో హైలెట్ గా నిలిచాయట. థమన్ ఈ రెండు సాంగ్స్ ని ఎంత అద్భుతంగా కంపోజ్ చేశాడో అంతకంటే అద్భుతంగా తెరకెక్కించాడట. ఇక సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ అసలు విశ్వ రూపం చూపిస్తాడట.
కోర్టులో పవన్ పేల్చే పంచ్ డైలాగ్స్ కి ఉక్కిరి బిక్కిరి అయ్యారట. పవన్ ముందు మిగతా వాళ్ళందరు తేలిపోయినట్టు అభిమానులు చెప్పుకుంటున్నారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమా రేంజ్ ఊహించని విధంగా పెంచాయని పబ్లిక్ టాక్. కెమెరా వర్క్.. థమన్ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా సక్సస్ కి పెద్ద ప్లస్ పాయింట్స్ అంటున్నారు. మొత్తానికి వకీల్ సాబ్ పవన్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ అని అభిప్రాయపడుతున్నారు.