CSK vs RCB : మ‌రి కొద్ది గంట‌ల‌లో చెన్నై vs ఆర్సీబీ మ్యాచ్.. ఫ‌స్ట్ మ్యాచ్‌లో ఎవ‌రు గెల‌వ‌నున్నారంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

CSK vs RCB : మ‌రి కొద్ది గంట‌ల‌లో చెన్నై vs ఆర్సీబీ మ్యాచ్.. ఫ‌స్ట్ మ్యాచ్‌లో ఎవ‌రు గెల‌వ‌నున్నారంటే..!

CSK vs RCB : కొద్ది రోజుల క్రితం ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ ముగిసింది. ఇందులో ఆర్సీబీ జ‌గ‌జ్జేత‌గా నిలిచింది. ఇక ఇప్పుడు మెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ మొద‌లు కాబోతుంది. మ‌రి కొద్ది గంట‌ల‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా, ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జ‌ర‌గ‌నుంది. ధోని వ‌ర్సెస్ కోహ్లీగా ఈ మ్యాచ్‌ని అభివ‌ర్ణిస్తున్నారు. అయితే చెన్నైకి ఈ సీజ‌న్‌లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉంటార‌ని రీసెంట్‌గా ప్ర‌క‌టించారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 March 2024,11:29 am

ప్రధానాంశాలు:

  •  CSK vs RCB : మ‌రి కొద్ది గంట‌ల‌లో చెన్నై vs ఆర్సీబీ మ్యాచ్.. ఫ‌స్ట్ మ్యాచ్‌లో ఎవ‌రు గెల‌వ‌నున్నారంటే..!

CSK vs RCB : కొద్ది రోజుల క్రితం ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ ముగిసింది. ఇందులో ఆర్సీబీ జ‌గ‌జ్జేత‌గా నిలిచింది. ఇక ఇప్పుడు మెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ మొద‌లు కాబోతుంది. మ‌రి కొద్ది గంట‌ల‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా, ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జ‌ర‌గ‌నుంది. ధోని వ‌ర్సెస్ కోహ్లీగా ఈ మ్యాచ్‌ని అభివ‌ర్ణిస్తున్నారు. అయితే చెన్నైకి ఈ సీజ‌న్‌లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉంటార‌ని రీసెంట్‌గా ప్ర‌క‌టించారు. ధోనిని కాకుండా రుతురాజ్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేయ‌డంతో ఇక వ‌చ్చే సీజ‌న్‌కి ధోని రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం ప‌క్కా అని అంద‌రు భావిస్తున్నారు. ధోని కెప్టెన్సీ నుండి త‌ప్పుకున్నా కూడా అత‌ని స‌ల‌హాలు, సూచ‌న‌లు రుతురాజ్‌కి తప్ప‌కుండా ఉంటాయి.

ఇక ఆర్సీబీ విష‌యానికి వ‌స్తే డుప్లెసిస్‌ కెప్టెన్సీలో కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌, సిరాజ్‌ లాంటి స్టార్లతో ఈ టీమ్ కూడా చాలా గ‌ట్టిగా ఉంది. రెండు జ‌ట్టు పోటీ ప‌డితే ఏ జ‌ట్టు గెలుస్తుంద‌ని చెప్ప‌డం కాస్త క‌ష్ట‌మే. హోమ్ గ్రౌండ్‌లో చెన్నై ఆడ‌డం వారికి క‌లిసి వ‌చ్చే అంశం. బ్యాటింగ్‌లో ఓపెనర్లుగా రుతురాజ్‌ గైక్వాడ్‌, డెవాన్‌ కాన్వె సీఎస్‌కేకు ప్రధాన బలం కాగా, మంచి ఫామ్‌లో ఉన్న‌ రచిన్‌ రవీంద్ర ఫ‌స్ట్ డౌన్‌లో వ‌చ్చి అద‌ర‌గొడ‌తాడు. ఇక మిడిల్డార్‌లో అజింక్యా రహానె, సమీర్‌ రిజ్వీ, ధోని ,జడేజా, శివమ్‌ దూబేతో టీమ్ ప‌టిష్టంగా ఉంది. ఇక బౌలింగ్‌ని కూడా త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. ముస్తిఫిజుర్‌ రెహ్మాన్‌, మహీష్‌ తీక్షణ, దీపక్‌ చాహర్ బ్యాట్స్మెన్‌ని ఇబ్బంది పెట్ట‌గ‌ల‌రు. ఇక జ‌డేజా, ర‌చిన్, దూబేని ఎక్స్‌ట్రా బౌల‌ర్స్‌గా ఉప‌యోగించుకోవ‌చ్చు.

CSK vs RCB మ‌రి కొద్ది గంట‌ల‌లో చెన్నై vs ఆర్సీబీ మ్యాచ్ ఫ‌స్ట్ మ్యాచ్‌లో ఎవ‌రు గెల‌వ‌నున్నారంటే

CSK vs RCB : మ‌రి కొద్ది గంట‌ల‌లో చెన్నై vs ఆర్సీబీ మ్యాచ్.. ఫ‌స్ట్ మ్యాచ్‌లో ఎవ‌రు గెల‌వ‌నున్నారంటే..!

ఇక ఆర్సీబీ బలం విష‌యానికి వ‌స్తే బ్యాటింగ్ అని చెప్పాలి. డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీ, రజత్‌ పాటిదార్‌, అనుజ్‌ రావత్‌, మ్యాక్స్‌వెల్‌, దినేష్‌ కార్తీక్‌తో బ్యాటింగ్ లైన‌ప్ మాములుగా లేదు. ఇక బౌలింగ్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌, అల్జారి జోసెఫ్‌, లూకీ ఫెర్గుసన్‌లు ప‌దునైన బంతుల‌తో బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెట్ట‌గ‌ల‌రు. ఇక మ్యాక్స్‌వెల్ కూడా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. కామెరూన్ గ్రీన్ కూడా బ్యాటింగ్‌,బౌలింగ్‌తో స‌త్తా చూపుతాడు. అయితే చెన్నైలో పోలిస్తే ఆర్సీబీ కాస్త వీక్‌గానే ఉంద‌ని చెప్పాలి. మ‌రోవైపు హోమ్ గ్రౌండ్‌లో చెన్నై ఓడిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూద్దాం.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది