Hardik Pandya : హార్ధిక్ ఇలాంటి వాడని అనుకోలేదు.. రోహిత్ సాయాన్ని కూడా మరిచి ఇలా చేశాడేంటి ?
ప్రధానాంశాలు:
Hardik Pandya : హార్ధిక్ ఇలాంటి వాడని అనుకోలేదు.. రోహిత్ సాయాన్ని కూడా మరిచి ఇలా చేశాడేంటి ?
Hardik Pandya : మరి కొద్ది గంటలలో ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. ఇక ప్రతి రోజు క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందనుంది. అయితే ఐపీఎల్‌కి ముందు రోహిత్ శర్మ కెప్టెన్సీ నుండి తప్పించి హార్ధిక్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేశారు ముంబై టీం. రెండు సార్లు గుజరాత్‌ను ఫైనల్‌కు, అందులో ఒక్కసారి ఆ జట్టును విజేతగా నిలిపిన హార్దిక్ ముంబై వెళ్లడం ఒకవైపు మంచిదే అయిన రోహిత్‌ని తొలగించి హార్ధిక్ ని కెప్టెన్ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హార్దిక్ పాండ్య పై నెట్టింట్లో వ్యతిరేకత వచ్చింది. కెప్టెన్సీ కోసమే గుజరాత్‌ను వదిలి ముంబైకి తిరిగొచ్చాడని అతనిపై దారుణమైన ఆరోపణలు చేశారు.
ఇంటా బయటా కూడా అతనిపై దారుణంగా ట్రోల్ చేశారు. హార్దిక్ ఎంత సర్దిచెప్పినా రోహిత్ ఫ్యాన్స్ కెప్టెన్సీ మార్పును ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. రీసెంట్‌గా ముంబై టీంతో కలిసిన రోహిత్ శర్మ తమ టీంతో కలిసి హార్దిక్ ఒకటైన వీడియో కూడా బయటికి వచ్చింది. ఇందులో ఇద్దరు కలిసి సంతోషంగా కనిపించారు. ఇది చూసి మళ్లీ ఇద్దరు కలిసారని, వారి కలిసికట్టుగా ఆడి జట్టుకి ట్రోఫీ అందిస్తారని భావిస్తున్నారు. అయితే హార్ధిక్‌ని ప్రతి సారి రోహిత్ శర్మ ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. కాని అతడు అతని కృతజ్ఞత మరిచి తన బుద్ధిని చూపించాడంటూ మండిపడుతున్నారు. తాజాగా హార్దిక్ చేసిన పోస్ట్‌లో ఐపీఎల్ వలనే తాను ఈ స్థాయికి వచ్చానని అన్నాడు.

Hardik Pandya : హార్ధిక్ ఇలాంటి వాడని అనుకోలేదు.. రోహిత్ సాయాన్ని కూడా మరిచి ఇలా చేశాడేంటి ?
హార్ధిక్ పోస్ట్‌లో తాను ఎక్కడ కూడా రోహిత్ ప్రస్తావన తీసుకురాలేదు పాండ్యా. అతడి పేరు చెప్పి కృతజ్ఞతలు చెప్పి ఉంటే అందరు సంతోషించేవాళ్ళు .ఎక్కడో చోట రోహిత్ ప్రస్తావన తీసుకువచ్చిన కూడా బాగుండేది. కాని ఆయన తనకు సపోర్ట్ అందించిన హార్ధిక్‌ని మరిచి ఎక్కడ కూడా రోహిత్ పేరు చెప్పకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ పేరు చెప్పి ఉంటే తనకు ఇచ్చిన సపోర్ట్‌కు హార్దిక్ రుణం తీర్చుకున్నట్లు ఉండేది. కానీ పాండ్యా అలా చేయకపోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ మండి పడుతున్నారు. హార్దిక్ బుద్ధి మారలేదని.. రోహిత్ వల్లే తాను ఈ స్థాయిలో మరిచి ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.