Mumbai Indians : ముంబైకి కొత్త కెప్టెన్ రాబోతున్నాడా.. రోహిత్ శర్మ కాదట.. మరి ఎవరు..?
Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్ ను ముంబై ఇండియన్స్‌ని వరుస పరాజయాలు పలకరిస్తున్న విషయం తెలిసిందే. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచడం లేదు. స్టార్ ఆటగాళ్లు టీమ్‌లో ఉన్నా ఎందుకో ఆ జట్టుని పరాజయాలు పలకరిస్తున్నాయి. అయితే ఆడిన రెండు మ్యాచ్‌లు ఓటమి చెందడంతో హార్ధిక్ పాండ్యాపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు చెత్త ప్రదర్శన కనబరచింది. ఎస్ఆర్‌హెచ్ జట్టు ఆటగాళ్లు ముంబై బౌలర్స్ ని చితకబాది ఏకంగా 277 పరుగుల భారీ స్కోరు చేశారు.
Mumbai Indians జస్ ప్రీత్ బుమ్రా ముంబై సారత్య బాధ్యతలు..?
జస్ ప్రీత్ బుమ్రా, కోయెట్జీ, పీయుష్ చావ్లా, హార్దిక్ వంటి స్టార్ బౌలర్ల ఉన్న ముంబై ఇలాంటి చెత్త రికార్డును మూటగట్టుకోవడం టీమ్‌తో పాటు ఫ్యాన్స్‌ని నిరాశపరచింది. అయితే కెప్టెన్‌గా హార్ధిక్ తీసుకుంటున్న నిర్ణయాల వలనే ఇలా జరుగుతుందని విశ్లేషకుల మాట. బుమ్రా వంటి స్టార్ బౌలర్ ను కాదని హార్దిక్ మొదటి ఓవర్ వేయడంపై మాజీ క్రికెటర్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాండ్యాని తొలగించి రోహిత్ శర్మని కెప్టెన్ చేయాలని కొందరు అంటుంటే, మరి కొందరు పాండ్యా స్థానంలో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రాకు ముంబై సారత్య బాధ్యతలు అప్పగించాలని అంటున్నారు.
ఫ్రాంచైజీ కూడా ఇప్పుడు బుమ్రాని కెప్టెన్‌గా నియమించాలని భావిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ముంబై మేనేజ్ మెంట్ హార్దిక్ ను సాధ్యమైనంత త్వరగా తప్పించి ఆ స్ధానంలో స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇచ్చి చూడాలని, ఆ తర్వాత ఫలితం ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నారు. కాగా తదుపరి మ్యాచ్ లో ఏప్రిల్ 1న వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 11న స్వదేశంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనూ, ఏప్రిల్ 14న వాంఖడేలో పంజాబ్ కింగ్స్‌తోనూ తలపడనుంది. అంటే ఆ జట్టు తమ సొంత మైదానంలో వరుసగా 4 మ్యాచ్‌లు ఆడనుంది.