Virat Kohli : విరాట్ కోహ్లీకి నరకం చూపిస్తున్న స్పెషల్ నెంబర్..17 ఏళ్ల తర్వాత సేమ్ సీన్
ప్రధానాంశాలు:
Virat Kohli : విరాట్ కోహ్లీకి నరకం చూపిస్తున్న స్పెషల్ నెంబర్..17 ఏళ్ల తర్వాత సేమ్ సీన్
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున మొదటి నుండి ఆడుతున్న ఈ సూపర్‌స్టార్ క్రికెటర్‌కు ఏప్రిల్ 18 తేదీ వణుకు పుట్టిస్తుంది.. 17 సంవత్సరాల క్రితం మొదటి ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సమయంలో విరాట్ కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు 2025లో మళ్ళీ ఏప్రిల్ 18న ఆడే అవకాశం వచ్చింది.

Virat Kohli : విరాట్ కోహ్లీకి నరకం చూపిస్తున్న స్పెషల్ నెంబర్..17 ఏళ్ల తర్వాత సేమ్ సీన్
Virat Kohli మారని రూట్..
ఈసారి పంజాబ్ కింగ్స్‌తో మళ్ళీ అతను ఒక్క పరుగు మాత్రమే చేశాడు. దీంతో ఈ 18 ఏళ్ల యాదృచ్చికతతో ఫ్యాన్స్ గుండెలు కూడా బరువెక్కాయి. ఈ విధంగా, 17 సంవత్సరాల కాలంలో, రెండు వేర్వేరు మ్యాచ్‌లు జరిగాయి. రెండింటిలోనూ పరుగులు నమోదు కాలేదు.2008లో ఐపీఎల్ చరిత్రలో తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగింది.
ఇందులో, కోహ్లీ మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఐదు బంతులు ఆడిన తర్వాత, అశోక్ దిండా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 140 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. బ్రెండన్ మెకల్లమ్ (158 అజేయంగా) అజేయ సెంచరీతో కేకేఆర్ 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆడుతున్న ఆర్‌సీబీ జట్టు 15.1 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌట్ అయింది. 17 సంవత్సరాల తర్వాత, కోహ్లీ మళ్ళీ ఏప్రిల్ 18న ఆడేందుకు వచ్చాడు. కోహ్లీ ఓపెనర్‌గా వచ్చి 3 బంతులు ఆడి ఒకే ఒక్క పరుగు చేశాడు.