Virat Kohli : వామ్మో కోహ్లీ.. బుల్లెట్ కన్నా స్పీడ్‌గా త్రో వేసి రనౌట్ చేశావ్‌గా.. ఏంటి నీ సీక్రెట్ వీడియో !
ప్రధానాంశాలు:
Virat Kohli : వామ్మో కోహ్లీ.. బుల్లెట్ కన్నా స్పీడ్‌గా త్రో వేసి రనౌట్ చేశావ్‌గా.. ఏంటి నీ సీక్రెట్ !
Virat Kohli : రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లోను, ఫీల్డింగ్‌లోను, రన్నింగ్‌లోను ఎంత మెరుపు వేగంతో ఉంటాడో మనకు తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున ఆడుతున్న కోహ్లీ నిన్న రాత్రి గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఫీల్డింగ్ చేసి ఔరా అనిపించాడు. బుల్లెట్ కన్నా స్పీడ్‌గా త్రో చేసి రనౌట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. గుజరాత్ బ్యాట్స్‌మెన్ షారూఖ్ ఖాన్ ఒక్కడు మాత్రమే ఆర్సీబీ బౌలర్స్‌ని సమర్ధంగా ఎదుర్కొని పరుగులు చేస్తున్నాడు. అయితే విజయ్ కుమార్ వైశాక్ వేసిన బంతిని తెవాతియా ఆఫ్‌సైడ్‌కు షాట్ ఆడగా, మరో ఎండ్‌లో ఉన్న షారుక్ సింగిల్ కోసం ముందుకు వెళ్లాడు.
Virat Kohli : కోహ్లీ మెరుపు త్రో
అయితే కోహ్లీ దగ్గరకి బాల్ వెళ్లడంతో తెవాతియా వద్దని చెప్పడంతో షారుక్ వెనక్కి వెళ్లాడు. అయితే కోహ్లిని చూసుకుంటూ కాస్త బద్దకంగా వెనక్కు వెళుతున్న సమయంలో విరాట్ మెరుపు త్రోకి షారూఖ్ ఔట్ అయ్యాడు. ఇంత జెట్ స్పీడ్‌తో బాల్ అందుకొని విసరడం చూసి అందరు షాకయ్యారు.షారూఖ్ వికెట్ తో గుజరాత్ టైటాన్స్ 87 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేకపోయింది.గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయగా, ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (1; 7 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (2; 7 బంతుల్లో) వరుస ఓవర్ల లో ఔటయ్యారు. గుజరాత్ పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి 23 పరుగులే చేసింది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు ఇదే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 147 పరుగులకు ఆలౌటైంది.
షారుక్ ఖాన్ (37; 24 బంతుల్లో, 5×4, 1×6) టాప్ స్కోరర్ గా నిలిచాడు. యశ్ దయాల్ (2/21), విజయ్ కుమార్ వైశాక్ (2/23), మహ్మద్ సిరాజ్ (2/29) తలో రెండు వికెట్లు తీసి గుజరాత్‌ని దెబ్బతీసారు. ఇక బెంగళూరు 148 పరుగుల లక్ష్య చేధనకి బరిలోకి దిగింది. కేవలం 13.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో, 10×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లి (42; 27 బంతుల్లో, 2×4, 4×6) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ (4/45) నాలుగు వికెట్లు తీశాడు.
???????????????????????? ???????? ????????????????????, ???????????????? ???????? ????????????????????, ???????????? ???????????????????? ???????? ???????????????????? ???????????? ???????????????????????? ???????????????? ???????????????????? ????#RCBvGT #TATAIPL #IPLonJioCinema #ViratKohli pic.twitter.com/xNhbIBu9Yw
— JioCinema (@JioCinema) May 4, 2024