Phone Switched Off : ఈ చిన్న ట్రిక్ ద్వారా దొంగిలించిన ఫోన్ స్విచ్ ఆఫ్ కాకుండా చేయొచ్చు ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Phone Switched Off : ఈ చిన్న ట్రిక్ ద్వారా దొంగిలించిన ఫోన్ స్విచ్ ఆఫ్ కాకుండా చేయొచ్చు ..??

 Authored By anusha | The Telugu News | Updated on :23 November 2023,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Phone Switched Off : ఈ చిన్న ట్రిక్ ద్వారా దొంగిలించిన ఫోన్ స్విచ్ ఆఫ్ కాకుండా చేయొచ్చు ..??

Phone Switched Off : ప్రస్తుతం అందరి చేతుల్లో మొబైల్స్ తప్పనిసరిగా ఉంటున్నాయి. ఉద్యోగులు, వ్యాపారం చేసే వాళ్ళు తమ వ్యక్తిగత అవసరాలతో పాటు ఆఫీస్ పనులకు సంబంధించిన పనులను కూడా మొబైల్ ద్వారా నిర్వహిస్తున్నారు. అయితే ఒకోసారి హడావుడి లో మొబైల్ ఫోన్లను మర్చిపోతూ ఉంటారు. మరికొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఫోను వేరే వాళ్ళు దొంగలిస్తుంటారు. ఎవరైనా ఫోన్ దొంగలించిన వెంటనే ముందుగా స్విచ్ ఆఫ్ చేస్తారు. కొన్ని రోజులపాటు స్విచ్ ఆఫ్ చేసి తర్వాత సిమ్ ను మార్చడం, తదితర పనులు చేస్తుంటారు. అయితే మొబైల్లో ఈ చిన్న ట్రిక్ ద్వారా దొంగిలించిన ఫోన్ స్విచ్ ఆఫ్ కాకుండా చేయవచ్చు.

మొబైల్స్ ఎంత జాగ్రత్తగా కాపాడుకున్న ఒక్కోసారి దొంగల బారిన పడకుండా ఉండదు. ఒకప్పుడు ఫోన్ దొంగలించబడితే అసలు దొరికేది కాదు. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కారణంగా ఫోన్ ఎక్కడున్నా ట్రేస్ చేయవచ్చు. అయితే అందుకు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోన్ దొంగలించబడితే దొంగలు ముందుగా మొబైలు స్విచ్ ఆఫ్ చేస్తుంటారు. దీంతో ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడం కష్టం. అయితే ఒక ట్రిక్ ద్వారా అసలు మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ కాకుండా చేయవచ్చు. అందుకోసం ముందుగా మొబైల్ లోని సెట్టింగ్స్ ని మార్చుకోవాలి.

ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్లి ‘ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ‘ లోకి వెళ్ళాలి. ఇక్కడ ‘ సిస్టం సెక్యూరిటీ ‘ అనే ఆప్షన్ కనబడుతుంది. దీనిపై క్లిక్ చేయాలి ఇప్పుడు ‘ రిక్వైర్డ్ పాస్వర్డ్ పవర్ ఆఫ్ ‘ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత వచ్చిన ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. దీనిపై ఉన్న ‘ ఫైండ్ మై డివైస్ ‘ అనే ఆప్షన్ను కూడా ఆన్ చేయాలి. దీంతో మీరు అనుకున్న సెట్టింగ్స్ కంప్లీట్ అవుతోంది. ఈ సెట్టింగ్స్ మార్చుకున్న తర్వాత ఫోను ఎవరు దొంగలించినా కూడా దానిని స్విచ్ ఆఫ్ చేయలేరు. ఆ సమయంలో వారికి పాస్వర్డ్ అడుగుతుంది. అందువల్ల ఈ విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకోవడం వలన ఫోన్ ఎక్కడుందో వెంటనే ట్రేస్ చేయవచ్చు. తర్వాత దొంగను వెంటనే పట్టుకోవచ్చు. మొబైల్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది