JIo Airtel : జియో బాటలోనే ఎయిర్‌టెల్.. ఒక్కసారిగా టారిఫ్‌లు అలా పెంచేసారేంటి..!
JIo Airtel : టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులకు కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి. అసలే వినియోగదారులు రీచార్జ్‌లతో సతమతం అవుతుండగా, ఇప్పుడు వారు ధరల పెంపు నిర్ణయం అందరు ఉలిక్కి పడేలా చేసింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు భారీగా పెరుగుతాయన్న ఊహాగానాలను నిజం చేస్తూ టెలికాం సంస్థలు ఒక్కొక్కటిగా ధరలు పెంచేస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. గురువారం రోజున రిలయన్స్ జియో తమ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా, మరుసటి రోజు అయిన శుక్రవారం దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ సైతం రీఛార్జ్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. కనీసం 11 శాతం నుంచి గరిష్ఠంగా 21 శాతం వరకు ప్లాన్ల ధరలు పెరగనున్నాయని స్పష్టం చేసింది.
JIo Airtel కొత్త రేట్లు ఇలా..
ఈ నిర్ణయంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ఈ నిర్ణయంతో కస్టమర్లకు అదనపు భారం పడనుంది. ఎయిర్‌టెల్ కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ధరల పెరుగుదలతో మెరుగైన నెట్‌వర్క్ మరియు స్పెక్ట్రమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. మరోవైపు జియో కొత్త ధరలు కూడా జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ పై రోజుకు 70 పైసల కన్నా తక్కువే ధరల పెంపు ఉంటోందని తెలిపింది. దీంతో సామాన్యులపై పెద్దగా ప్రభావం ఉండదని తెలిపింది. ఇంతకు ముందు ఎయిర్‌టెల్ కంపెనీ నవంబర్, 2021లో 20-25 శాతం మేర రీఛార్జ్ ధరలు పెంచింది. ఆ తర్వాత ఎలాంటి గణనీయమైన మార్పులు చేయలేదు. కొద్ది రోజుల క్రితమే స్పెక్ట్రం వేలం ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత రీఛార్జ్ ధరలు పెంపు ప్రకటనలు చేస్తుండడం గమనార్హం.

JIo Airtel : జియో బాటలోనే ఎయిర్‌టెల్.. ఒక్కసారిగా టారిఫ్‌లు అలా పెంచేసారేంటి..!
అన్‌లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్‌లో ప్రస్తుతం రూ.179తో 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు 28 రోజుల పాటు ఇస్తోంది. ఈ ప్లాన్ ధరను రూ.199కి పెంచింది. జులై 3 నుంచి రూ.199 చెల్లించాల్సి వస్తుంది. రూ. 265 ప్లాన్ ధర ఇకపై రూ. 299కు లభించనుంది. ఇందులో రోజుకు ఒక జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు 28 రోజుల కాలపరిమితితో లభిస్తాయి. అలాగే 84 రోజుల వాలిడిటీ గల రూ.455 అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్ ధరను రూ.509కి చేర్చింది. ఇక 365 రోజుల ప్లాన్ ధరను రూ.1799 నుంచి రూ. 1999కి పెంచింది. 24 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం, రోజుకు 100 ఎస్సెమ్మెలు లభిస్తాయి. రూ.299గా ఉన్న ప్లాన్ ధరను రూ. 349కి పెంచింది. 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఇవే కాదు.. సంస్థ అందించే అన్ని రకాల రీచార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. డేటా యాడ్ ఆన్ ప్యాక్‌లు, పోస్టు పెయిడ్ ప్లాన్ల ధరలను కూడా పెంచిన ఎయిర్‌టెల్ భారతి హెక్సాకామ్ లిమిటెడ్‌తోపాటు అన్ని సర్కిళ్లకు పెరిగిన ధరలు వర్తిస్తాయని తెలిపింది.