Train Ticket : తత్కాల్ టికెట్ బుక్ చేయాలా ? ఇవే స్మార్ట్ చిట్కాలు.. రైలు ప్రయాణం మరింత సులభం!
ప్రధానాంశాలు:
Train Ticket : తత్కాల్ టికెట్ బుక్ చేయాలా ? ఇవే స్మార్ట్ చిట్కాలు.. రైలు ప్రయాణం మరింత సులభం!
Train Ticket : రైల్లో ప్రయాణించడం అంటే చాలామందికి ఇష్టమైన అనుభవం. కానీ టికెట్ బుకింగ్ అంత ఈజీ కాదు. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయంలో కొన్ని నిమిషాల్లోనే టికెట్లు పూర్తి అవుతాయి. అయితే కొన్ని స్మార్ట్ ట్రిక్స్ పాటిస్తే, కుటుంబంతో కలసి ఆరామంగా రైలు ప్రయాణం చేయవచ్చు. ఇప్పుడు ఆ చిట్కాలు ఎంటంటే..

Train Ticket : తత్కాల్ టికెట్ బుక్ చేయాలా ? ఇవే స్మార్ట్ చిట్కాలు.. రైలు ప్రయాణం మరింత సులభం!
Train Ticket : ఈ టిప్స్ పాటించండి..
ముందుగా IRCTC యాప్ లేదా వెబ్‌సైట్‌లో లాగిన్ అయిపోండి. ఖాతా ఆధార్‌తో లింక్ అయితే నెలకు 12 తత్కాల్ టికెట్లు బుక్ చేయవచ్చు. వేగంగా రిస్పాన్స్ వచ్చేలా Wi-Fi లేదా 4G/5G కనెక్షన్ వాడండి. ప్రయాణికుల పేరు, వయస్సు, లింగం వంటి వివరాలు ముందుగానే మాస్టర్ లిస్ట్‌లో జత చేయండి. టికెట్ బుకింగ్ సమయంలో ఒక్క క్లిక్‌తో ఎంపిక చేసుకోవచ్చు.UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ముందే సిద్ధంగా ఉంచండి. ఇలా చేస్తే వెంటనే టికెట్ బుక్ చేసుకోవచ్చు.
తత్కాల్ బుకింగ్ సమయాలు చూస్తే.. AC క్లాస్‌కు: ఉదయం 10 గంటలకే బుకింగ్ ప్రారంభం, స్లీపర్ క్లాస్‌కు: ఉదయం 11 గంటలకు ప్రారంభం . ఒక నిమిషం ఆలస్యం అయినా టికెట్ వెయిటింగ్‌కి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి టైమింగ్‌కి సరిగ్గా సిద్ధంగా ఉండండి. ప్రీమియం తత్కాల్ అత్యవసర సమయంలో ట్రై చేయండి. ఛార్జీలు ఎక్కువైనా టికెట్ దొరికే అవకాశం ఎక్కువ. మహిళల కోసం ప్రత్యేక కోటా ఉంటుంది. ఒంటరిగా ప్రయాణించే మహిళలు దీన్ని వినియోగించుకోవచ్చు. ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేయడం కష్టంగా అనిపించదు. ఈ చిట్కాలు పాటించి, రైల్వే ప్రయాణాన్ని స్ట్రెస్‌ఫ్రీగా ఎంజాయ్ చేయండి!