3 Jobs AI : ఏఐ ప్రభావం.. మూడు కీలక రంగాలకు గండం, కొత్త అవకాశాలకు మార్గం
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో ఏఐ తక్కువ సమయంలో ఎక్కువ పనిని ఖచ్చితంగా పూర్తిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో, అనేక కంపెనీలు మానవ వనరుల స్థానంలో ఏఐ టూల్స్‌ను ప్రాధాన్యతగా ఉపయోగించడం మొదలుపెట్టాయి.

3 Jobs AI : ఏఐ ప్రభావం.. మూడు కీలక రంగాలకు గండం, కొత్త అవకాశాలకు మార్గం
3 Jobs AI : వీరికి ఇబ్బంది..
రానున్న ఐదేళ్లలో భారత్‌లో మూడు ప్రధాన ఉద్యోగ రకాలపై ఏఐ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. వీటిలో డేటా ఎంట్రీ ఒకటి. డేటా వితరణ, ప్రాసెసింగ్ వంటి పనులు పూర్తిగా ఆటోమేషన్ ద్వారా చేయగలగడం వల్ల డేటా ఎంట్రీ ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోతాయన్న అంచనాలు ఉన్నాయి. టెలికాలింగ్ లో కస్టమర్లతో ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేయడాన్ని ఇప్పుడు ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్లు సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాయి.
ప్రాథమిక కస్టమర్ సర్వీస్ : సర్వీస్ క్వెరీస్, ఫిర్యాదుల పరిష్కారం వంటి ప్రాథమిక కార్యకలాపాలను ఇప్పుడు చాట్‌బాట్స్ లేదా ఆటోమేటెడ్ సిస్టమ్స్ నిర్వహిస్తున్నాయి. ఏఐ పనులు వేగంగా, నిరంతరంగా చేస్తుంది. ఉద్యోగుల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ అవుట్‌పుట్ ఇవ్వగల సామర్థ్యం ఉంది. అటు సెలవులు, విరామాలు అవసరం లేకుండా పని చేసే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఖర్చులను గణనీయంగా తగ్గించగలదన్న నమ్మకం కంపెనీలలో పెరుగుతోంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నా, కొన్ని కొత్త ఉద్యోగాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఏఐ టూల్స్ మేనేజ్‌మెంట్, డేటా మానిటరింగ్, సిస్టమ్ ఆడిట్, ఆర్గానైజేషనల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో నూతన నియామకాలు అవసరమవుతాయి.