Alcohol : మద్యం ప్రియులకి కిక్ బాగా ఇచ్చారుగా.. తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు..!
ప్రధానాంశాలు:
Alcohol : మద్యం ప్రియులకి కిక్ బాగా ఇచ్చారుగా.. తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు..!
Alcohol : కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుంది. ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టగా వ్యవసాయానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. అయితే బడ్జెట్ సమావేశాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఖచ్చితంగా మద్యం ఉండాల్సిందే . ఎన్నికల సమయాల్లో మందు ఏరులై పారుతుంది. మద్యంతో ఎంజాయ్ చేస్తున్న మందుబాబులకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాకే ఇవ్వబోతుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ఆదాయాన్ని అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Alcohol మద్యం ధరలు పైపైకి..
సాధారణంగా రాష్ట్రంలో రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచడం తెలిసిన విషయమే.. ఈసారి కూడా మద్యం ధరలు పెంచే యోచలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. రెండేళ్ల క్రితం కేసీఆర్ గవర్నమెంట్ మద్యం ధరలు పెంచగా, ఇప్పుడు రేవంత్ సర్కార్ అదే యోచనలో ఉన్నట్లు బడ్జెట్ సమావేశాల తర్వాత స్పష్టమవుతుంది. దాదాపు 10 వేల కోట్ల ఆదాయం వరకు వస్తుందని బడ్జెట్ లో పేర్కొన్నారు. స్టేట్ ఎక్సయిజ్ సుంకం గత ఏడాది రూ.20,290 కోట్ల ఆదాయం సమకూరిందని, ఈ ఏడాది అదనంగా రూ.5,400 వేల కోట్ల ఆదాయం వస్తుందన్న అంచనాలో ఉందని తెలిపారు. ఇక లిక్కర్ పై వ్యాట్ రూపంలో ఆదాయం మరో 4 వేల కోట్ల ఆదాయం ఉంటుందని అంచనా వేశారు.
అయితే దసరా పండుగక ముందే ఆ నిర్ణయం తీసుకోనుందా? అంటే ఆదాయ అంచనాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. నిన్న బడ్జెట్ తర్వాత హరీష్‌రావు కూడా గత ఏడాది తాను అంచనా వేసిన మద్యం ఆదాయం కంటే అధిక మొత్తంలో ఆదాయం సమకూరుతుందని ప్రస్తుత ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయని అన్నారు. అంటే మద్యం ధరలు కచ్చితంగా పెంచుతారనే అనుమానం తమకు కలుగుతోందని హరీష్‌రావు విమర్శించారు. గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు అధికంగా ఉన్నాయని, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే బెల్ట్ షాపులు మూసివేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి , ఇప్పటికీ బెల్ట్ షాపులు మూసివేయించకపోగా మరిన్ని తెరిచేందుకు ఆస్కారం ఇచ్చారని హరీష్‌రావు విమర్శించారు