Jagadish Reddy : కొత్త వ్యూహం అమలు చేసే ఆలోచనలో బీఆర్ఎస్.. స్పీకర్‌పై అవిశ్వాసం
ప్రధానాంశాలు:
Jagadish Reddy : కొత్త వ్యూహం అమలు చేసే ఆలోచనలో బీఆర్ఎస్.. స్పీకర్‌పై అవిశ్వాసం
Jagadish Reddy : బీఆర్ఎస్ నేత , మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ మనస్తాపం చెందారు. జగదీష్ రెడ్డి వ్యవహారంపై స్పీకర్‌తో చర్చిస్తున్నారు. జగదీష్ రెడ్డి బే షరతుగా క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్ చేశారు. దళిత స్పీకర్‌పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు.

Jagadish Reddy : కొత్త వ్యూహం అమలు చేసే ఆలోచనలో బీఆర్ఎస్.. స్పీకర్‌పై అవిశ్వాసం
Jagadish Reddy రసాభస..
సభ మీ సొంతం కాదంటూ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడడం రచ్చకు దారి తీసింది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ రెడ్డి జోక్యం చేసుకుని జగదీష్ రెడ్డి స్పీకర్‌ను బెదిరిస్తున్నారని.. ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అన్నారు.
ఇక బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు అసెంబ్లీ లాబీలో చిట్ చాట్‌గా మాట్లాడారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకపోతే స్పీకర్‌పై అవిశ్వాసం పెడతామన్నారు. నిన్న ముఖ్యమంత్రి అక్షింతలు వేయడం.. ఈరోజు సభలో కాంగ్రెస్ సభ్యులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ డిపెన్స్‌లో పడిందని, స్పీకర్‌ను కలిశామని, రికార్డు తీయాలని అడిగామన్నారు. దళితుడుని అగౌవరం పరిచే విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడలేదన్నారు.