KCR : పార్టీ ప్రక్షాళన దిశగా కేసీఆర్ అడుగులు… కేటీఆర్ స్థానంలో హరీష్ రావుకు కీలక బాధ్యతలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : పార్టీ ప్రక్షాళన దిశగా కేసీఆర్ అడుగులు… కేటీఆర్ స్థానంలో హరీష్ రావుకు కీలక బాధ్యతలు…!

KCR  : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పొందిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తమ పార్టీ ప్రక్షాళన దిశగా కసరత్తులు ప్రారంభించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ సొంత జిల్లా అయినటువంటి మెదక్ లో కూడా బీఆర్ఎస్ కు కలిసి రాలేదు. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో పార్టీ క్యాడర్ మొత్తం కూడా నిరుత్సాహం లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 June 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  KCR : పార్టీ ప్రక్షాళన దిశగా కేసీఆర్ అడుగులు... కేటీఆర్ స్థానంలో హరీష్ రావుకు కీలక బాధ్యతలు...!

KCR  : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పొందిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తమ పార్టీ ప్రక్షాళన దిశగా కసరత్తులు ప్రారంభించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ సొంత జిల్లా అయినటువంటి మెదక్ లో కూడా బీఆర్ఎస్ కు కలిసి రాలేదు. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో పార్టీ క్యాడర్ మొత్తం కూడా నిరుత్సాహం లో మునిగిపోయి ఉంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

దీనిలో భాగంగానే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న కేటీఆర్ ను బాధ్యతలు నుంచి తప్పించి ఆ బాధ్యతలను మరొకరికి ఇవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిలో భాగంగానే ఆ స్థానాన్ని కుటుంబంలోని మరొకరికి కేటాయించాలా లేదా బయట వ్యక్తులకు కేటాయించాలఆ అనే విషయంపై కెసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాలలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించేందుకు హరీష్ రావు పేరు ముందు వరసలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాని ఇక్కడ హరీష్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్లయితే కుటుంబ సభ్యులకే మరోసారి పదవి ఇచ్చారనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో హరీష్ రావుతో పాటు ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల తో పాటు మరికొన్ని వర్గాల నుండి ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే విధంగా కెసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.

KCR పార్టీ ప్రక్షాళన దిశగా కేసీఆర్ అడుగులు కేటీఆర్ స్థానంలో హరీష్ రావుకు కీలక బాధ్యతలు

KCR : పార్టీ ప్రక్షాళన దిశగా కేసీఆర్ అడుగులు… కేటీఆర్ స్థానంలో హరీష్ రావుకు కీలక బాధ్యతలు…!

KCR  కేటీఆర్ స్థానంలో హరీష్ రావు..

అంతేకాక రానున్నది ఎన్నికల కాలం అవ్వడంతో పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించగలిగే నాయకుల కోసం గులాబీ బాస్ ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటేే హరీష్ రావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను స్వీకరించేందుకు సానుకూలంగా లేరట. ఒకవేళ కెసీఆర్ దిగివచ్చి అప్పగిస్తే ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది