KCR : కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదా..?

 Authored By brahma | The Telugu News | Updated on :5 April 2021,12:14 pm

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రి వర్గ సభ్యుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం. అయితే ఆయన మంత్రి వర్గంలోని కొందరి నేతల తీరు వలన పార్టీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో ఎలాగైనా సరే కేసీఆర్ ను గద్దె నుండి దించాలని బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఎలాంటి దశలో అధికార పార్టీ చాలా జాగురతతో మెలగాలి. అదే సమయంలో బీజేపీని ఇరుకున పెట్టె విధంగా విమర్శలు సంధించాలి. కానీ తెరాస లోని ముగ్గురు కీలక మంత్రులు ఈ విషయంలో తమకేమి పట్టదు అన్నట్లు వున్నారని సమాచారం. నోరు తెరిచి బీజేపీని ఒక్క మాట అనటానికి కూడా ఆయా నేతలు ముందుకు రావటం లేదని తెలుస్తుంది. పైగా వాళ్ళు బీజేపీతో టచ్ లో ఉన్నట్లు కేసీఆర్ కు సమాచారం అందినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

KCR : ఆ ముగ్గురిపై సీరియస్

kcr is a key decision

kcr is a key decision

దీనిపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయా మంత్రులకు సంబదించిన శాఖలకు చెందిన వివరాలు, ఆ మంత్రుల పనితీరుకు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కేసీఆర్ దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వాళ్ల విషయంలో కాస్త కఠినంగానే ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆ మంత్రులు పెద్దగా సచివాలయం ముఖం కూడా చూడటం లేదనే మాటలు వినిపిస్తున్నాయి.

పరిపాలన విషయం పక్కన పెడితే ఆ నేతలు బీజేపీకి దగ్గర కావటం కేసీఆర్ కు ఆగ్రహం తెప్పిస్తున్నాట్లు సమాచారం. పైగా తెరాస వ్యతిరేకులందరు కలిసి ఎన్నికలకు ముందు సరికొత్త పార్టీని పెట్టబోతున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో ఆ ముగ్గురు మంత్రుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటే, మిగిలిన వాళ్లకు భయం అనేది ఉంటుందని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తుంటే మరికొద్ది రోజుల్లో తెలంగాణలో రాజకీయా దుమారం రేగే అవకాశం మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది