Govt School Students : ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Govt School Students : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం మాత్రమే ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు పెట్టేవారు. కానీ.. ఇప్పుడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా విద్యార్థులకు ప్రభుత్వం అందించనుంది. ఈరోజు నుంచే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం లాంఛనంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించింది. చదువే కాదు.. చదువు కోసం పాఠశాలకు వెళ్లే విద్యార్థుల కడుపు కూడా నింపాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ సీఎం బ్రేక్ ఫాస్ట్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ఇవాళ సికింద్రాబాద్ పరిధి వెస్ట్ మారేడు పల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు.
అనంతరం అక్కడే విద్యార్థులతో కలిసి మంత్రి కేటీఆర్ టిఫిన్ చేశారు. స్కూల్ ప్రారంభానికి అరగంట ముందు విద్యార్థులకు టిఫిన్ అందిస్తారు. వారంలో ఒక్కో రోజు ఒక్కో టిఫిన్ మెను ప్రకారం అందజేస్తారు. సోమవారం ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, దానితో పాటు చట్నీ అందిస్తారు. మంగళవారం పూరి, ఆలు కూర్మా లేదా టమాటా బాత్, చట్నీ అందిస్తారు. బుధవారం ఉప్మా సాంబార్, లేదా కిచిడీ, దానికి చట్నీ అందిస్తారు. గురువారం మిల్లెట్ ఇడ్లీ దానితో పాటు సాంబారు లేదా పొంగల్ దానితో పాటు సాంబారు అందిస్తారు. శుక్రవారం మిల్లెట్ ఇడ్లీ లేదా ఉగ్గాని లేదా పోహా అందిస్తారు. వాటికి చట్నీ కూడా ఉంటుంది. లేదంటే కిచీడీ దానితో పాటు చట్నీ అందిస్తారు. ఇక.. శనివారం పొంగల్ దానితో పాటు సాంబారు అందిస్తారు. లేదంటే వెజ్ పలావ్ దానికి రైతా లేక ఆలు కుర్మా అందిస్తారు.