Hyderabad.. ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మినిస్టర్ కేటీఆర్

0
Advertisement

దిగ్గజ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా విరాళంతో హైదరాబాద్‌లోని సనత్ నగర్ సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ తెలంగాణ ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ప్రారంభించారు. ఆస్పత్రికి టెక్ మహీంద్రా సంస్థ పదకొండు అంబులెన్సులను కూడా ఇవ్వగా వాటిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆక్సిజన్ ప్లాంట్ కోసం విరాళమందించిన టెక్ మహీంద్రా సంస్థను అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని పాల్గొన్నారు. ఇకపోతే కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనూ ఆక్సిజన్ సిలిండర్స్ కోసం జనాలు తీవ్రఅవస్థలు పడ్డ సంగతి అందరికీ విదితమే. కరోనా బారిన పడిన పేషెంట్స్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. సినీనటుడు సోనుసూద్ తన శక్తి మేరకు అవసరమైన వారికి సిలిండర్స్ అందజేసిన సంగతి అందరికీ తెలిసిందే.

 

Advertisement