Mother Dead Body : కొడుకు, కూతుర్ల కర్కశత్వం.. ఆస్తుల కోసం 3 రోజులుగా ఫ్రీజర్ లో తల్లిశవం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mother Dead Body : కొడుకు, కూతుర్ల కర్కశత్వం.. ఆస్తుల కోసం 3 రోజులుగా ఫ్రీజర్ లో తల్లిశవం..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 May 2024,1:30 pm

Mother Dead Body : కన్న పేగు బంధాలను మట్టిలో కలిపేస్తున్నారు కొడుకులు, కూతుర్లు. ఓ తల్లి తన బిడ్డల్ని ఎంతో కష్టపడి పెంచుతుంది. కాలికి మట్టి అంటకుండా పెంచుకుంటే.. చివరకు ఆ తల్లిని మట్టిలో కలిపేందుకు కూడా కొడుకులు, కూతుర్లు గొడవలు పెట్టుకుంటున్నారు. అన్నం పెట్టి పెంచిన తల్లికి అంత్యక్రియలు చేసేందుకు కూడా ఇష్టపడట్లేదు. ఇలాంటి ఘటన ఇప్పుడు తెలంగాణలో జరిగింది. వినడానికి కూడా బాధాకరంగా ఉండే వార్త ఇది. తల్లి చినిపోతే ఆస్తుల కోసం గొడవలు పడుతూ తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా 3 రోజులుగా బాడీని ఫ్రీజర్ లోనే పెట్టిన ఘటన ఇది.

Mother Dead Body : చికిత్స పొందుతూ..

ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారి గూడెంలో చోటు చేసుకుంది. ఈ గ్రామంలో లక్ష్మమ్మ జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అయితే ఓ కొడుకు చాలాకాలం క్రితమే చనిపోయాడు. ఇక పిల్లలకోసం లక్ష్మమ్మ బాగానే ఆస్తులు సంపాదించింది. వారందరినీ బాగానే సెటిల్ చేసింది. అయితే వృద్ధాప్య సమయంలో ఆమె ఎక్కవుగా కూతుర్ల వద్దే ఉంటుంది. రీసెంట్ గా ఆమె కూతురు ఇంటికి వెళ్లగా కాలు జారి కారి తీవ్ర గాయాలు అయ్యాయి. 3 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆమె కన్నుమూసింది.

అయితే ఆస్తుల పంపకాలు జరగిన తర్వాతనే అంత్యక్రియలు చేయాలని కొడుకు, కూతుర్లు అంబులెన్సును ఆపేశారు. తల్లి దగ్గర ఉన్న రూ.21 లక్షల్లో రూ.6లక్షలు ఆస్పత్రి ఖర్చులు కాగా మిగిలినవి కొడుకు తీసుకున్నాడు. 21 తులాల బంగారాన్ని కూతుర్లు పంచుకున్నారు. అయినా సరే అంత్యక్రియలు చేసే విషయంలో గొడవ వచ్చింది. అంత్యక్రియల ఖర్చులు కూతుర్లు కూడా సమానంగా భరించాలని కొడుకు కండీషన్ పెట్టాడు. దానికి కూతుర్లు ఒప్పుకోలేదు. దాంతో గొడవ పెద్దదైంది. ఆ పంచాయితీ తెగక 3 రోజులుగా తల్లి శవాన్ని ఫ్రీజర్ లోనే ఉంచుతున్నారు.

Mother Dead Body కొడుకు కూతుర్ల కర్కశత్వం ఆస్తుల కోసం 3 రోజులుగా ఫ్రీజర్ లో తల్లిశవం

Mother Dead Body : కొడుకు, కూతుర్ల కర్కశత్వం.. ఆస్తుల కోసం 3 రోజులుగా ఫ్రీజర్ లో తల్లిశవం..!

ఈ విషయంలో కొడుకు, కూతుర్లపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొడుకు, కూతుర్ల తీరుపై మండిపడుతున్నారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వారిపై భగ్గుమంటున్నారు. తల్లి కంటే ఆస్తులు ఎక్కువైపోయాయా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది