Ponguleti Srinivas Reddy : పువ్వాడ అజయ్ ఏమైనా పుడింగా.. పొంగులేటి నోట్లో నుంచి వినకూడని పదాలు.. ఇంకా ఏమన్నారంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ponguleti Srinivas Reddy : పువ్వాడ అజయ్ ఏమైనా పుడింగా.. పొంగులేటి నోట్లో నుంచి వినకూడని పదాలు.. ఇంకా ఏమన్నారంటే?

Ponguleti Srinivas Reddy : పువ్వాడ అజయ్ గాడు ఏమైనా పుడింగా.. మళ్లీ చెబుతున్నాను.. పువ్వాడ అజయ్ గాడు ఏమైనా పుడింగా అంటూ రెండు సార్లు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. పువ్వాడ అజయ్ మీద నేను పోటీ చేయాలా? అంత అవసరమే లేదు. నేను పోటీ చేయాల్సిన అవసరం లేదు. బచ్చాగాడిని […]

 Authored By kranthi | The Telugu News | Updated on :9 July 2023,8:00 pm

Ponguleti Srinivas Reddy : పువ్వాడ అజయ్ గాడు ఏమైనా పుడింగా.. మళ్లీ చెబుతున్నాను.. పువ్వాడ అజయ్ గాడు ఏమైనా పుడింగా అంటూ రెండు సార్లు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. పువ్వాడ అజయ్ మీద నేను పోటీ చేయాలా? అంత అవసరమే లేదు. నేను పోటీ చేయాల్సిన అవసరం లేదు. బచ్చాగాడిని పెట్టి గెలిపిస్తాను. అజయ్ సహా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వను.. అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శపథ చేశారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కడ కూడా ఉండలేక చివరకు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ప్రస్తుతం పొంగులేటి చూసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలవకుండా చేసేందుకు పొంగులేటి కృషి చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన నేత, మంత్రి పువ్వాడ అజయ్ పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ponguleti srinivas reddy slams on puvvada ajay

ponguleti srinivas reddy slams on puvvada ajay

Ponguleti Srinivas Reddy : ఈసారి పువ్వాడను ఓడిస్తారా?

2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ను ప్రజలు ఓడించారు. దీంతో ఆయన ప్రస్తుతం పార్టీలో అంత యాక్టివ్ గా లేరు. దీంతో ఖమ్మంలో పువ్వాడ హవా మొదలైంది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి తుమ్మల ప్లేస్ లో మంత్రిగా వచ్చారు. అందుకే.. ఇప్పుడు పువ్వాడను బీఆర్ఎస్ పక్కన పెట్టాలంటే ఆయన్ను ఓడించాలి. అందుకే.. పువ్వాడను ఓడించడమే ధ్యేయంగా ఖమ్మం రాజకీయాలు నడుస్తున్నాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది