Liquor : మందు బాబులకి కిక్కిచ్చే న్యూస్.. ఈ సారి పెరగనున్న విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్ ధరలు..ఎంతంటే..?
ప్రధానాంశాలు:
Liquor : మందు బాబులకి కిక్కిచ్చే న్యూస్.. ఈ సారి పెరగనున్న విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్ ధరలు..ఎంతంటే..?
Liquor : ఇటీవలి కాలంలో మద్యం అమ్మకాల జోరు ఊపందుకుంది. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్.. దీంతో మద్యం అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు డిమాండ్ కు తగ్గట్లు కంపెనీలు ఉత్పత్తిని పెంచేశాయి. అంతేకాదు రేట్లని కూడా పెంచేస్తూ తాగకుండానే కిక్కిస్తున్నాయి.ఇటీవల Beer బీర్ల ధరలను 15 నుంచి 20శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Liquor : మందు బాబులకి కిక్కిచ్చే న్యూస్.. ఈ సారి పెరగనున్న విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్ ధరలు..ఎంతంటే..?
Liquor తాగకుండానే కిక్..
పెరిగిన మద్యం ధరలు ఈనెల 11 నుంచే అమల్లోకి వచ్చాయి. ధరల పెంపు వల్ల ఏడాదికి రూ.2వేల కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బీర్ల రేట్లు పెంపుతోనే మందు బాబులు మొత్తుకుంటుంటే ఇప్పుడు రేవంత్ సర్కార్ త్వరలోనే చీప్ లిక్కర్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యం ధరలు 15 నుండి 20 శాతం పెంచే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ఈ పెంపుతో మద్యం వినియోగదారులపై అదనపు భారం పడనుంది. బీర్ల పెంపుతో చాలా మంది విస్కీ,బ్రాండీలపై ఆసక్తి చూపుతుండగా, ఇప్పుడు ఆ రేట్లు కూడా పెంచేస్తే మా పరిస్థితి ఏంటా అని కొందరు అయోమయంలో పడిపోతున్నారు. ఏది ఏమైన ఈ మధ్య కాలంలో రేవంత్ సర్కార్ షాకుల మీద షాకులు ఇస్తుంది.