Revanth Reddy : కేసీఆర్‌కి సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి.. గొర్రెల పథకంలోనే రూ.700 కోట్లు స్వాహ చేశారన్నది నిజం కాదా?
ప్రధానాంశాలు:
Revanth Reddy : కేసీఆర్‌కి సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి.. గొర్రెల పథకంలోనే రూ.700 కోట్లు స్వాహ చేశారన్నది నిజం కాదా?
Revanth Reddy : ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. తాజాగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలతో హరీష్ రావు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారు. ప్రజలను మభ్య పెట్టాలనిచూస్తే వారు నమ్మడానికి సిద్ధంగా లేరు. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్లకు గుండు సున్నా ఇచ్చారు. అయినా వారిలో మార్పు రాలేదు. అదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy రేవంత్ రెడ్డి ఫైర్..
గత ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ను రూ.7 వేల కోట్లకు అమ్మిందని, గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్లు అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని విమర్శించారు. బతుకమ్మ చీరలు అని సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేయలేదని వెల్లడించారు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన భూములు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అంటూ బీఆర్ఎస్ నేతలను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. బతుకమ్మ చీరల పంపిణీలోనూ అవినీతి జరిగిందన్నారు. బతుకమ్మ చీరలు అని తెలంగాణ మహిళలను నమ్మించి సూరత్ నుంచి కిలోల చొప్పున కొనుగోలు చేసి ఇక్కడి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. . పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుండు సున్నా ఇచ్చినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లీ బఠానీల మాదిరిగా రూ.7వేల కోట్లకే తెగనమ్మారు. గొర్రెల పథకం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారు. బతుకమ్మ చీరలను వ్యవసాయ పొలాల్లో పిట్టలను బెదిరించటానికి కడుతున్నారని రేవంత్ అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డలకు సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ను కూడా బీఆర్ఎస్ నేతలు దోపిడీకి వాడుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు