Telangana Elections Results 2023 : రెండు స్థానాల్లో వెనుకంజ‌ ఈట‌ల రాజేంద‌ర్.. 9 స్థానాల్లో లీడ్ లో బీజేపీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Telangana Elections Results 2023 : రెండు స్థానాల్లో వెనుకంజ‌ ఈట‌ల రాజేంద‌ర్.. 9 స్థానాల్లో లీడ్ లో బీజేపీ..!

Telangana Elections Results 2023 : తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బిగ్ షాక్ త‌గిలింది. ఇప్పటి వ‌ర‌కు పూర్త‌యిన రౌండ్స్ ప్ర‌కారం ఈట‌ల రాజేంద‌ర్ వెనుకంజ‌లో ఉన్నారు. ఈట‌ల రాజేంద‌ర్.. హుజురాబాద్, గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈట‌ల రాజేంద‌ర్ వెనుకంజ‌లో ఉన్నారు. హుజురాబాద్ లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి పాడి కౌశిక్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 December 2023,11:40 am

ప్రధానాంశాలు:

  •  Telangana Elections Results 2023 : రెండు స్థానాల్లో వెనుకంజ‌ ఈట‌ల రాజేంద‌ర్.. 9 స్థానాల్లో లీడ్ లో బీజేపీ..!

  •  Telangana Elections Results 2023 తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు

Telangana Elections Results 2023 : తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బిగ్ షాక్ త‌గిలింది. ఇప్పటి వ‌ర‌కు పూర్త‌యిన రౌండ్స్ ప్ర‌కారం ఈట‌ల రాజేంద‌ర్ వెనుకంజ‌లో ఉన్నారు. ఈట‌ల రాజేంద‌ర్.. హుజురాబాద్, గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈట‌ల రాజేంద‌ర్ వెనుకంజ‌లో ఉన్నారు. హుజురాబాద్ లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి పాడి కౌశిక్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. ఇక‌.. గ‌జ్వేల్ లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు లీడ్ లో ఉన్నారు.

హుజురాబాద్ లో ఈట‌ల‌కు ఇది బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. 2018 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ గెలిచిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేర‌డంతో హుజురాబాద్ లో ఉపఎన్నిక వ‌చ్చింది. అప్పుడు కూడా ఈట‌ల రాజేంద‌ర్ గెలిచారు. కానీ.. 2023 ఎన్నిక‌ల్లో మాత్రం ఈట‌ల‌కు ఇది మైన‌స్ అనే చెప్పుకోవాలి. ఇప్ప‌టి వ‌ర‌కు లెక్కించిన రౌండ్స్ చూసుకుంటే ఈట‌ల వెనుకంజ‌లో ఉన్నారు.

ఈట‌ల రాజేంద‌ర్ ఈసారి ఖ‌చ్చితంగా గ‌జ్వేల్, హుజురాబాద్ నుంచి గెలుస్తా అని అనుకున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ప్ర‌జ‌ల‌కు అదే చెప్పారు. కానీ.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం హుజురాబాద్ లో ఆయ‌న వెనుకంజ‌లో ఉండ‌టంతో ఈటల రాజ‌కీయ భ‌వితవ్యం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 9 స్థానాల్లో మాత్ర‌మే లీడ్ లో ఉంది. 2018 ఎన్నిక‌ల్లో బీజేపీకి ఒక్క సీటు మాత్ర‌మే వ‌చ్చింది. కానీ.. ఇప్పుడు మాత్రం బీజేపీ 9 స్థానాల్లో గెలుపు దిశ‌గా ప‌య‌నిస్తోంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది