Ration Card : మీ ఇంట్లో ఈ వస్తువులుంటే మీకు రేషన్ కార్డ్ రానట్టే… అనర్హత కింత లెక్క కడతారు జాగ్రత్త..!
Ration Card : నేషనల్ ఫుడ్ సెక్యురిటీ యాక్ట్ కింద జాతీయ ఆహార భద్రత చట్టంలో భాగంగా పేదలకు మాత్రమే రేషన్ కార్డులు జారీ చేయపడతాయని తెలిసిందే. ఐతే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పథకాల కోసం కొందరు రేషన్ కార్డ్ అప్లై చేస్తారు. వివిధ పథకాలు పొందేందుకు వీలు కల్పించే ఈ రేషన్ కార్డ్ పొందేందుకు షరతులు కొన్ని ఉంటాయి. ఐతే ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే దరఖాస్తు దారులకు రేషన్ కార్డ్ పొందకుండా అనర్హత వ్హేస్తున్నారు.
Ration Card : ఇంతకీ అవేంటి అంటే..
ఫ్లాట్లు లేదా ఇళ్లతో సహా 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ బూమి ఉంటే ఆ వ్యక్తి రేషన్ కార్డ్ కు అనర్హుడు.
అంతేకాదు కార్లు, ట్రాక్టర్లు వంటి నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వ్యక్తి రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనర్హత కలిగి ఉంటాడు.
గృహోపకరణాలో కూడా రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనర్లు వంటి విలాసవంతమైన వస్తువులు కలిగి ఉంటే అనర్హత చేస్తారు.
ఇంటి యజమానికి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఆ కుటుంబానికి రేషన్ కార్డ్ రాదు.
అంతేకాదు వ్యక్తి వార్షికాదాయం 2 లక్షలు కంటే ఎక్కువ ఉంటే గ్రామాల్లో అనర్హత.. పట్టణాల్లో అయితే 3 లక్షలు దాటితే మాత్రం రేషన్ కార్డుకి అర్హులు కారు.
ఇక ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా రేషన్ కార్డ్ ఇవ్వబడదు.
లైసెన్స్ పొందిన తుపాకీలు కలిగి ఉన్నా కూడా ఆ వ్యక్తికి రేషన్ కార్డ్ పొందే ఛాన్స్ లేదు.
ఐతే తప్పుడు పత్రాలతో మోసపూరిత రేషన్ కార్డ్ తీసుకుంటే.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటారు.
రేషన్ కార్డ్ మరియు సంబందిత ప్రయోజనాలు అవసరమైన ప్రజలు కోసం రిజర్వ్ చేస్తారు. ఐతే అర్హత లేని వారిక్ కూడా ఇచి వీటిని దుర్వినియోగం చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.