Venu Swamy : కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వపోవడానికి కారణం ఇదే.. వేణుస్వామి ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వపోవడానికి కారణం ఇదే.. వేణుస్వామి ..!

 Authored By tech | The Telugu News | Updated on :7 March 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వపోవడానికి కారణం ఇదే.. వేణుస్వామి ..!

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఆయన ఒక సెలబ్రిటీగా మారారు.ఇప్పటికే చాలామంది సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్పినా ఆయన అందులో కొన్ని నిజంగా జరిగినవి, మరికొన్ని జరగలేదు అయితే అందులో కొన్ని జరగటంతో వేణు స్వామిని కొందరు నమ్ముతూ వస్తున్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్ మూడోసారి గెలవరని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ గురించి వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓడిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయని, ఒకటి కేసీఆర్ జాతకం అని, రెండవది టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం. ఈ రెండు కారణాల వల్ల కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాలేకపోయారు.

ఆయనకు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం లేదని, ప్రధానమంత్రి యోగం ఏమాత్రం లేదని గతంలో చెప్పానని అన్నారు. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వలన సమస్యలు మొదలయ్యాయని, టిఆర్ఎస్ గా పార్టీని ఉంచినట్లయితే 61 స్థానాలకు అయినా పరిమితం అయ్యేది. ఎప్పుడైతే టిఆర్ఎస్ పేరునప మార్చారో కేసీఆర్ కు ఉన్న లక్ అంతా పోయిందని వేణు స్వామి అన్నారు. బీఆర్ఎస్ గానే కొనసాగితే పార్టీ ఏమాత్రం పుంజుకోదని, బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చుకుంటేనే ఆ పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని లేదంటే ఆ పార్టీ కనుమరుగవుతుందని, ఆ పార్టీలో ఉన్న వాళ్లంతా వలస వెళ్లిపోతారని, మళ్లీ టిఆర్ఎస్ అని పార్టీ పేరు పెట్టాలని, పేరు మార్చితేనే 2025 తర్వాత పార్టీ పుంజుకుంటుంది అని వేణు స్వామి తెలిపారు.

బీఆర్ఎస్ గా పార్టీ పుంజుకొనే అవకాశం లేదని, కేటీఆర్ జాతకంలో బీఆర్ఎస్ పార్టీ అనేది సరైనది కాదని, కవితకు కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది సరైనది కాదని, బీఆర్ఎస్ అని పెట్టడం వలన కేటీఆర్, కవిత నష్టపోయారని, కేసీఆర్ పదేళ్లు సీఎంగా అనుభవించారు. ఇప్పుడు కేటీఆర్, కవితనే నష్టపోయారని వేణు స్వామి తెలిపారు. టిఆర్ఎస్ గా పార్టీని కొనసాగిస్తేనే కేసీఆర్ 2025 తర్వాత పుంజుకునే అవకాశం ఉంటుందని, టీఆర్ఎస్ గా ఉంటే ఆ పార్టీ కనుమరుగవుతుందని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అలాగే కేసీఆర్ కు ఆరోగ్య పరమైన, న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఆయన భవిష్యత్తులో జైలుకు వెళ్లే అవకాశం ఉందని వేణు స్వామి తెలిపారు.

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది