Extra Jabardasth : లోపలికి వెళ్దాం రండి… రోహణి – రాకేష్ రొమాన్స్ రచ్చ..!
Extra Jabardasth : బుల్లితెరపై సందడి చేసే ప్రోగ్రామ్స్‌లో ఒకటైన ‘జబర్దస్త్’ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నది. ఈ క్రమంలోనే ఈటీవీ మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్ వారు ప్రేక్షకులకు మరింత వినోదం పంచేందుకుగాను ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ ప్రోగ్రాం తీసుకొచ్చారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా, అది సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.ఇక ఈ వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్‌లో భాగంగా ఆర్టిస్టులు బాగానే పర్ఫార్మ్ చేయగా, అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల చేశారు.ఆ ప్రోమో చూస్తుంటే ఈ సారి ఆర్టిస్టులు తమ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశారని అర్థమవుతున్నది. స్టార్టింగ్ స్కిట్‌ను వర్ష, ఇమాన్యుయల్ ప్రదర్శించారు.

extra jabardasth Rohini rakesh romance
ఆ తర్వాత నెక్స్ట్ స్కిట్‌లో మధ్య తరగతి దంపతులుగా రౌడీ రోహిణి- రాకింగ్ రాకేశ్ అదరగొట్టేశారు. రాకింగ్ రాకేశ్ స్కిట్ చేయబోతుండగానే మనో పంచ్‌లు మామూలుగా వేయలేదు. ఆఫీసు నుంచి రాగానే లోపలికి వెళ్దాం రండని భార్య రోహిణి పిలవగా, మనది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రాధ.. మనం ఏనాడైనా అనగానే ‘లోపలికి వెళ్లామా?’ అని మనో కామెంట్ చేశాడు. ఇక ఆ తర్వాత రాకేశ్ మిడిల్ క్లాస్ కష్టాలు వివరిస్తూ.. ఆఫీసు నుంచి వచ్చి ఇంత తిన్నామా? అనగానే ‘హాల్‌లో పడుకున్నామా’ అని మళ్లీ మరొక పంచ్ వేసేశాడు మనో. దాంతో నవ్వులు పూశాయి. ఇంతలోనే ‘శుభలగ్నం’ సినిమాలో ఆమని జగపతిబాబును డబ్బుకు అమ్మిన మాదిరిగా రోహిణి రూ.7 కోట్లకు ఒకరికి అమ్మేస్తుంది. ఆఫీసుకు వెళ్తున్న క్రమంలో చిన్న మామూలు ఇచ్చి వెళ్తానని చెప్పగా, అలా ఎందుకని రోహిణి అడగగా, రాకేశ్ పక్కన జోడీగా వచ్చిన మహిళ..
Extra Jabardasth : ఒకరిని మంచి మరికరి పర్ఫార్మెన్స్.. ఆర్టిస్టులకు మనో, రోజా పంచ్‌లు..

extra jabardasth Rohini rakesh romance
రోహిణిపై ఇంగ్లిష్‌లో అరుస్తుంది. ఇక యాజ్ యూజ్యువల్‌గా ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్.. రెచ్చిపోయారు. స్కిట్‌లో భాగంగా ఆటో రాం ప్రసాద్ కత్తులు సాన పెట్టేవాడిలాగా, సుడిగాలి సుధీర్ పెద్దమ్మ అయిన అమ్మవారి ముందర డ్యాన్స్ చేసే నృత్యకారుడిగా, బిచ్చగాడిలా గెటప్ శ్రీను కనిపించాడు. ఇక జిగేల్ జీవన్ లవ్ డే పేరిట స్కిట్ చేయగా, అవ్ సక్సెస్ అయిన ప్రేమ జంటలకు భోజనాలు పెట్టించడం ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ఈ సారి డోసు బాగా పెంచేసినట్లు కనబడుతున్నది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
