Bank : ఈ బ్యాంక్‌లో కళ్లుచెదిరే ఆఫర్.. రూ.లక్షకు పది కోట్ల లాభం.. ఎందులోనంటే?
Bank : డబ్బులు సంపాదించేందుకు చాలా మంది విపరీతంగా కష్టపడుతుండటం మనం చూడొచ్చు. అయితే, అందరు అలా చేయరు. కొంత మంది స్మార్ట్ వర్క్ చేసి డబ్బును ఈజీగా సంపాదిస్తుంటారు. అయితే, డబ్బులు బాగా సంపాదించే మార్గాల్లో స్టాక్ మార్కెట్ ఒకటిగా ఉంటుంది. కానీ, ఇందులో భారీ స్థాయిలోనే రిస్క్ ఉంటుందన్న సంగతి ప్రతీ ఒక్కరు గమనించాల్సి ఉంటుంది. కంపెనీలపై పెట్టే షేర్స్ అన్ని కూడా ఒకే రకమైన లాభాలను అయితే అందించబోవు. షేరు ప్రాతిపదికన వచ్చే లాభనష్టాలు మారిపోతుంటాయన్న సంగతి అందిరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మల్టీ బ్యాగర్ షేర్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా మీరు భారీ లాభాలు పొందొచ్చు.
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు లాంగ్ రన్‌లో ఇన్వెస్టర్స్‌కు బాగా లాభం సంపాదించి పెడుతుంది. ప్రజెంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ ప్రైస్ రూ.1,966 సమీపంలో ఉంది. ఇరవై ఏళ్ల కిందట రూ.1.94 అనగా సుమారు రెండు రూపాయలు ఉన్న ధర ఇప్పుడు రెండు వేలకు దగ్గరలో ఉంది. 2001 అక్టోబర్ 12న షేర్ ధర రూ.1.94 ఉండేది. ఇప్పుడు ఆ ధర ఏకంగా 1,011 రెట్లు పెరిగింది. అంటే అప్పట్లో ఒక లక్ష రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ ఏకంగా రూ. పదికోట్లకు రీచ్ అయ్యేది.
Bank : కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్స్‌తో భారీ లాభాలు..
ఈ నేపథ్యంలో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్స్ ప్లాన్ చేసుకోవలాని పలువురు సూచిస్తున్నారు. ఇకపోతే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం సమీప భవిష్యత్తులో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ ధర రూ.2,100కు చేరొచ్చని అంటున్నారు. స్టాప్ లాస్ రూ.1,900 గా నిర్ణయించుకుంటే బాగుంటుందని కొందరు నిపుణులు సూచనలు చేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ సెక్టార్‌లో మంచి పేరున్న కోటక్ మహీంద్రా బ్యాంక్ పర్ఫార్మెన్స్ ఇంకా మెరుగవుతుందని, షేర్ ధర ఇంకా పెరగొచ్చని కొందరు బ్యాంకింగ్ రంగ నిపుణులతో పాటు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.