YS Jagan : చంద్రబాబు చేసిన సేమ్ మిస్టేక్ నే రిపీట్ చేస్తున్న వైఎస్ జగన్..?
YS Jagan : వైఎస్ జగన్.. గురించి చెప్పాలంటే ఎవరైనా పాజిటివ్ ఎక్కువగా చెబుతారు. ఎందుకంటే మొదటిసారి అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్.. ఏపీని బాగానే పాలిస్తున్నాడు. సంక్షేమ పథకాలు కూడా ప్రారంభించాడు. అయితే.. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా సరే.. పార్టీల కంటే కూడా కులాలు, మతాలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏ కులానికి చెందిన నేత ముఖ్యమంత్రి అయితే ఆ కుల ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్టు గుర్తుంచుకోవాలి. ఇదివరకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కమ్మ ప్రభుత్వం అధికారంలో ఉంది అన్నారు. ఇప్పుడేమో.. రెడ్ల ప్రభుత్వం అధికారంలో ఉంది అంటున్నారు జనాలు.
అయితే.. గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన తప్పు ఏంటో తెలుసా? కేవలం తన కులాన్ని మాత్రమే పట్టించుకొని.. మిగితా వాటిని వదిలేయడం. అదే చంద్రబాబుకు చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. 2019 ఎన్నికల్లో ఓడిపోయేలా చేసింది. కులం కులం కులం.. ఇది అన్ని సమయాల్లో సెట్ కాదు. చంద్రబాబు విషయంలోనూ అదే జరిగింది. మిగితా కులాలను, మతాలను, ఇతర సామాజికి వర్గాలను పక్కన పెట్టేయడం వల్ల చంద్రబాబును.. ఆయన పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఏపీ ప్రజలు.
YS Jagan : చంద్రబాబు చేసిన తప్పే జగన్ కూడా చేస్తున్నారా?
వైఎస్ జగన్ ను రెడ్డి అనో మరేదో అనో జనాలు ఓటేయలేదు. ఆయన్ను ముఖ్యమంత్రిగా గెలిపించలేదు. కేవలం ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయనకు ఒక చాన్స్ ఇచ్చారు ఏపీ ప్రజలు. కానీ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఫెయిల్ అవుతున్నారా? చంద్రబాబు చేసిన తప్పులే చేస్తున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
కనీసం ప్రజలతో మాట్లాడటం లేదు. జగన్ దర్శనమే మహాభాగ్యంగా మారింది. చివరకు.. వైసీపీ నేతలకు కూడా జగన్ దర్శనం కరువయిందట. ముఖ్యంగా క్రిస్టియన్ ముద్రను వదిలించుకోవడం కోసం సీఎం జగన్ చేస్తున్న పనుల వల్ల దళిత క్రిస్టియన్స్ లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఇతర కులాలు, మతాల ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్.. ఏ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికైనా తను చేస్తున్న తప్పులను తెలుసుకుంటారా? లేక అలాగే సాగిపోతారా? అనేది తెలియాల్సి ఉంది.