Intinti Gruhalakshmi 12 Dec Today Episode : దివ్య కడుపు పోయేలా రాజ్యలక్ష్మి మరో ప్లాన్.. మళ్లీ పరందామయ్య మిస్సింగ్.. యాక్సిడెంట్ అయి చనిపోతాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 12 Dec Today Episode : దివ్య కడుపు పోయేలా రాజ్యలక్ష్మి మరో ప్లాన్.. మళ్లీ పరందామయ్య మిస్సింగ్.. యాక్సిడెంట్ అయి చనిపోతాడా?

Intinti Gruhalakshmi 12 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 డిసెంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 1125 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మామయ్యకు అల్జీమర్స్ వ్యాధి ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లాం.. డాక్టర్లు చెప్పారు.. అని నందుకు చెబుతుంది తులసి. ఇప్పటికి ఇది చిన్న సమస్యే కానీ రాను రాను ఎక్కువ అవుతుందని డాక్టర్ చెప్పారని చెబుతుంది తులసి. ఇప్పటికైనా అర్థమయిందా.. ఎందుకు ఏడుస్తున్నామో అని […]

 Authored By gatla | The Telugu News | Updated on :12 December 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  నందుకు అసలు విషయం చెప్పిన తులసి

  •  ఉపవాసం పేరుతో దివ్య కడుపు పోయేలా ప్లాన్ చేసిన రాజ్యలక్ష్మి

  •  ఆసుపత్రికి పరందామయ్యను తీసుకెళ్లిన నందు

Intinti Gruhalakshmi 12 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 డిసెంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 1125 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మామయ్యకు అల్జీమర్స్ వ్యాధి ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లాం.. డాక్టర్లు చెప్పారు.. అని నందుకు చెబుతుంది తులసి. ఇప్పటికి ఇది చిన్న సమస్యే కానీ రాను రాను ఎక్కువ అవుతుందని డాక్టర్ చెప్పారని చెబుతుంది తులసి. ఇప్పటికైనా అర్థమయిందా.. ఎందుకు ఏడుస్తున్నామో అని అంటుంది తులసి. దీంతో నందుకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెంటనే నందు పరందామయ్య దగ్గరికి వెళ్తాడు. లోపల పరందామయ్య ఫోన్ చూస్తూ ఉంటాడు. ఇంతలో నందును చూసి ఈ మొబైల్ ఆఫ్ అయిపోయింది. ఏం చేసినా ఆన్ కావడం లేదు. ఒకసారి ఆన్ చేసి ఇవ్వు అంటాడు పరందామయ్య. వెంటనే ఆన్ చేసి ఇస్తాడు. ఇక నుంచి మిమ్మల్ని చూసుకోవడానికి నేను ఉంటాను నాన్న అంటే.. ఆ మాట అన్నావు చాలు. ఏ తండ్రికైనా ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి. అవును ఇంత త్వరగా వచ్చావేంటి.. కెఫే త్వరగా క్లోజ్ చేశావా.. కెఫే ఎలా నడుస్తోంది అని అడుగుతాడు. దీంతో మేము కెఫే క్లోజ్ చేసి చాలా రోజులు అవుతోంది అంటాడు నందు. దీంతో మరి దీనికి తులసి ఒప్పుకుందా? కెఫే లేకపోతే ఇల్లు గడవడం కష్టం కదా. ఎలా అని అడుగుతాడు పరందామయ్య. దీంతో నందుకు ఏం చెప్పాలో అర్థం కాదు. తులసితో పాటు నేను కూడా సామ్రాట్ ఆఫీసులో పని చేస్తున్నా నాన్న. తులసి సీఈవో అయితే నేను జీఎం అంటాడు నందు.

అయితే ఓకే. సామ్రాట్ చాలా మంచివాడు అంటాడు పరందామయ్య. సామ్రాట్ ను ఒకసారి చూడాలని ఉంది. ఇంటికి తీసుకొస్తావా అంటాడు పరందామయ్య. దీంతో నందుకు ఏం చెప్పాలో అర్థం కాదు. అది కుదరదు నాన్న. ఆయన విమానం యాక్సిడెంట్ లో పోయారు అంటాడు నందు. ఆయన పోవడం ఏంటి.. నీకేమైనా మతి పోయిందా అంటాడు పరందామయ్య. తులసి అక్కడికి వస్తే అదే అడుగుతాడు పరందామయ్య. సామ్రాట్ గారు నిజంగానే చనిపోయారు మామయ్య అని చెబుతుంది తులసి. ఆ తర్వాత మామయ్య అలసిపోయారు. మీరు కాసేపు పడుకోండి. ఇంతలో నందు భోజనం చేస్తారు అని చెబుతుంది తులసి. దీంతో సరే.. వెళ్లి భోం చేసిరా అంటాడు పరందామయ్య. బయటికి వచ్చాక ఏంటి మీరు జబ్బు సంగతి మామయ్యకు చెప్పేద్దామనుకున్నారా? ఇలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయకండి. అసలే ఈ కన్ఫ్యూజన్ తో మామయ్య కిందా మీదా పడుతున్నారు. మనందరి వైపు అనుమానంగా చూస్తున్నారు. విషయం చెప్పి ఇంకా ఇబ్బంది పెడదామనా? అంటుంది తులసి. మీరు ఎక్కువ దూరం ఏం ఆలోచించరా? మనం మామయ్యను కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉంది. మీ ప్రవర్తనతో ఏమాత్రం ఇబ్బంది పెట్టినా మామయ్యను కాపాడుకోలేం అంటుంది తులసి. ఆయనకు జబ్బు ఉందన్న సంగతి అస్సలు తెలియనీయొద్దు. బాధపెట్టొద్దు. ముఖ్యంగా నాతో ప్రవర్తించినట్టు ఆయనతో ప్రవర్తించొద్దు అంటుంది తులసి. ప్లీజ్ అని బతిమిలాడుతుంది.

Intinti Gruhalakshmi 12 Dec Today Episode : దివ్య విషయంలో అసలు నీ ప్లాన్ ఏంటి అని రాజ్యలక్ష్మిని అడిగిన బసవయ్య

మరోవైపు రాజ్యలక్ష్మి ప్రశాంతంగా కూర్చొని ఉండటం చూసిన బసవయ్య అసలు ఏం అర్థం కావడం లేదు అంటాడు. దీంతో ఆరోగ్యం బాగోలేదా అంటే మనసు బాగోలేదు అక్కయ్య. నాకు చాలా ప్రశ్నలు మనసులో మెదులుతున్నాయి అంటాడు బసవయ్య. అసలు దివ్య విషయంలో నీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. నేను ఎప్పుడు తనను ఏం చేస్తానో అనే టెన్షన్ తో పుట్టింటికి పారిపోతోంది కదా. అది తెలియడం లేదా? అంటుంది రాజ్యలక్ష్మి. ఒక కుక్కను చంపాలి అంటే.. అది పిచ్చి కుక్క అని జనాలను నమ్మించాలి. ఆ తర్వాత ఏం చేసినా జనాలు పట్టించుకోరు. దివ్య విషయంలో కూడా నేను చేయాలని అనుకున్నది అదే. అంటే.. దివ్యకు పిచ్చి అని నమ్మిస్తావా అంటే అంతే కదా అంటుంది రాజ్యలక్ష్మి.

మరోవైపు నందు.. తన తండ్రి పరిస్థితి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తనకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు తులసికి దివ్య కాల్ చేస్తుంది. అమ్మ.. ఏం చేస్తున్నావు అంటే. ఏం లేదు. అందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ దేవుడికి పూజ పూర్తి చేశాను. ఇంతలో నువ్వు కాల్ చేశావ్ అంటుంది తులసి. నువ్వు రోజూ పూజ చేస్తూనే ఉంటావు. ఆయన చేసేది చేస్తూనే ఉంటారు అంటుంది. అమ్మకే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నా సమస్యల గురించి ఎందుకు అని అవేం చెప్పకుండానే నేను పుట్టింటికి వచ్చేస్తా అంటుంది. దీంతో ఈ అమ్మకు అంతకంటే సంతోషం లేదు. కాకపోతే ఒకటి అంటుంది. ఎలాగూ 5వ నెల తర్వాత డెలివరీకి నిన్ను పుట్టింటికి తీసుకురావాలి కదా. అప్పటి వరకు అయినా మీ అత్త గారు అక్కడ నువ్వు ఉండాలని కోరుకుంటారు కదా అంటే గోంగూర ఏం కాదు అంటుంది దివ్య. నేను వస్తా అంటుంది.

మరోవైపు రాజ్యలక్ష్మి ఏదో ప్లాన్ వేస్తుంది. దివ్య తులసి కోటకు పూజ చేయడానికి వెళ్తుండగా నిజంగానే నువ్వు ఉపవాసం ఉంటావా అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. దీంతో అవును అంటుంది దివ్య. అందుకే నేను కూడా ఉపవాసం ఉంటున్నాను అంటుంది రాజ్యలక్ష్మి. తులసికి పూజ చేయాలి కదా అంటాడు బసవయ్య. మరోవైపు పరందామయ్యను ఆసుపత్రికి తీసుకెళ్తాడు నందు. అక్కడ సెక్యూరిటీ పరందామయ్యను ఎవరో అనుకొని బయటికి పంపిస్తాడు. దీంతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు పరందామయ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది