Viral video : ఇద్దరిని ఎక్కించుకుని బండి నడుపుతున్న శునకం వైరల్ వీడియో
Viral video: ఈ భూమి మీద పెరుగుతున్న అన్ని జంతువుల్లో తెలివిగల జంతువులు ఏమైనా ఉన్నాయంటే అవి కుక్కలు అని ఎవరైనా చెబుతున్నారు. ఇక జలచరాల విషయానికొస్తే డాల్పిన్ గురించి చెప్పుకుంటారు. ఈ రెండు జంతువులు కొంచెం మనిషి వలే ఆలోచిస్తుంటాయి. ట్రైనింగ్ ఇస్తే మనిషిలాగానే అద్భుతాలు సైతం చేస్తుంటాయి. సాధారణంగా జంతువులు ఒకదానికొకటి ఆడుకుంటాయి. గొడవ పడుతుంటాయి.కానీ మనిషి చెప్పేది విని అర్థం చేసుకుని చేయడం అనేది కుక్కలకు మాత్రమే సాధ్యమవుతుంది.
అందుకే చాలా మంది తమ ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటుంటారు. అవి అన్ని పనుల్లో యాజమానులకు తోడుగా ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు సాయం చేస్తుంటాయి. మన ఇంటికి రక్షణతో పాటు మన వెన్నంటే తిరుగుతూ అమితమైన ప్రేమను కనబరుస్తాయి.శునకాలు విశ్వాసానికి పెట్టింది పేరు. మనం ఇంట్లో లేని సమయంలో ఇంటి ముందు నిలబడి కాపలాగా ఉండే కుక్కలు.. యాజమానిని సులువుగా గుర్తిస్తాయి. కళ్లకు గంతలు కట్టినా సువాసన ద్వారా తన యాజమాని ఎవరో గుర్తించే శక్తి శునకాలకు ఉంటుంది.

a dog riding a bike with two people on board Viral video
Viral video : బైక్ నడుపుతున్న శునకం..
అప్పుడప్పుడు అవి చేసే పనులు చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. వాటికి ట్రైనింగ్ ఇవ్వడంతో అవి యాజమాని చెప్పిన పనిని చేస్తుంటాయి. వస్తువులు, బాల్స్ పడవేస్తే తెచ్చి ఇవ్వడం, ఇంట్లో బకెట్స్ తీసుకుని రావడం ఇదంతా ఒకఎత్తయితే.. కొన్ని డాగ్స్ వాహనాలు, బైక్స్, స్కేట్ బోర్డ్స్ కూడా నడుపుతుంటాయి. తాజాగా ఓ కుక్క ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకుని బండి నడుపుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తెగ మురిసిపోతున్నారు. జీనియస్ కుక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Yok artık köpek motosiklet sürüyor
???????????????? pic.twitter.com/d0TRAn14ct— yok artık (@yokartik_ya) December 14, 2021