కావడిలో 150 కి.మీ తల్లిని మోసుకుంటూ వెళ్లిన కొడుకు.. వైరల్ వీడియో !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

కావడిలో 150 కి.మీ తల్లిని మోసుకుంటూ వెళ్లిన కొడుకు.. వైరల్ వీడియో !!

 Authored By aruna | The Telugu News | Updated on :15 July 2023,9:00 am

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ యువకుడు తన తల్లిని కావడిలో మోసుకుంటూ హరిద్వార్ దర్శనానికి వెళ్లారు. ఇది చూసిన అందరూ ఆ కుర్రాడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ సృష్టిలో కన్నతల్లిని మించిన దైవం లేదు. తను తిన్నా పిల్లలు కడుపు చూసేది తల్లి మాత్రమే. ఏ వయసులోనైనా అమ్మకు సాటి అమ్మే. మనం ఎంత పెద్ద వారమైనా మనకోసం తప్పించే మనసు అమ్మకు మాత్రమే ఉంది. కుటుంబం కోసం ప్రతి విషయాన్ని త్యాగం చేసే అమ్మకు మనం ఏమి ఇచ్చిన తక్కువే అవుతుంది.

అలాంటి అమ్మను మనం చివరిదాకా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. లేదంటే మనిషి జన్మకు అర్థమే ఉండదు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులను తక్కువగా చూస్తున్నారు. అలాంటిది ఈ కుర్రాడు తన తల్లిని కావడిలో మోసుకుంటూ హరిద్వార్ లోని శివుడి దర్శనానికి వెళ్ళాడు. ఇది చూసిన కొందరు వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఉత్తర భారత దేశంలో హరిద్వార్ యాత్ర బాగా జరుగుతుంది. ఈ యాత్ర జూలై 15 వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం దాదాపు రెండు లక్షల మంది ఈ యాత్రలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

A son with mother in kavadi viral news

A son with mother in kavadi viral news

కన్వర్ యాత్రలో రహదారులన్నీ భక్తులతో రద్దీగా ఉన్నాయి. హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్ దర్శనం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఫుల్ రద్దీగా ఉండే భక్తుల మధ్య ఓ యువకుడు తన తల్లిని కావడిలో ఓవైపు కూర్చోబెట్టుకుని, మరోవైపు గంగాజలాన్ని మోస్తూ శివయ్యను స్మరిస్తూ వెళ్తున్నాడు. ఇక్కడ హరిద్వార్ లో గంగా జలాన్ని సేకరించి తమ సొంత గ్రామాలలో శివాలయాలకు సమర్పిస్తారు. ఈ యాత్రలో అందరూ కాలినడకన వెళతారు. దర్శనం ముగిశాక ఇంటికి వెళ్లేటప్పుడు బీహార్ లోని గౌముక్, గంగోత్రి సుల్తాన్ గంజ్ వంటి ప్రదేశాలను సందర్శిస్తారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది