Viral Video : బుల్లెట్ బండి సాంగ్‌కు ఇరగదీసిన పెళ్లి కూతురు.. డాన్స్ వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : బుల్లెట్ బండి సాంగ్‌కు ఇరగదీసిన పెళ్లి కూతురు.. డాన్స్ వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :22 August 2022,2:00 pm

Viral Video : సోషల్ మీడియా పుణ్యమా ప్రపంచం నలుమూలలా ఎక్కడ ఏం జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది తమ పెళ్లి ఎలా జరగాలో ముందే ఒక ఐడియాకు వచ్చేస్తున్నారు. పెళ్లి ఫోటోల నుంచి తాళి కట్టేవరకు..సంగీత్ నుంచి పెళ్లి బారాత్ వరకు అంతా ప్రీ ప్లాన్డ్‌గా తయారు చేయించుకుంటున్నారు.ఇక పెళ్లి ఘట్టం ముగియగానే వారికి నచ్చిన రీతిలో ఫోటోలు తీయించుకుంటున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడటం లేదంటే అతిశయోక్తి కాదు. కొందరు జంటలైతే పెళ్లికి ముందే ప్రీవెడ్డింగ్ షూటింగ్ పేరట వేరే ప్రాంతాలకు వెళ్లి మరీ ఫోటోలు తీయించుకుంటున్నారు.

ఇదంతా ఎందుకు చేస్తున్నారని ఎవరైనా అడిగితే జీవితంలో పెళ్లి ఒకేసారి వస్తుందని అందుకే మెమోరీస్ కోసం ఇవన్నీ చేస్తున్నట్టు చెబుతున్నారు. పెళ్లి డ్రెస్ నుంచి కాస్మోటిక్స్ వరకు అన్నీ సెలెక్టివ్ ఐటమ్స్ పై దృష్టి సారిస్తున్నారు. అమ్మాయిని మండపంలోకి తీసుకొచ్చే సమయంలో కొందరు సంగీత్ టైప్ కోలలతో డ్యాన్సింగ్ కాన్సెప్ట్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇది చాలా ఫేమస్ అయ్యింది. ప్రతిఒక్కరూ ఇలాంటి హంగు ఆర్భాటాలను తమ ప్రతిష్టగా తీసుకుంటున్నారు. ఇక పెళ్లి అనంతరం కొందరు గిప్టు హంపర్స్ లాంటివి కూడా చుట్టాలకు పంచిపెడుతుంటారు.

Bride dance video viral of youtube

Bride dance video viral of youtube

ఇదంతా పెళ్లిలో భాగంగానే ట్రీట్ చేస్తున్నారు. చివరగా పెళ్లి బారాత్ విషయానికొస్తే అమ్మాయిని అత్తింటికి పంపించే క్రమంలో డీజే సౌండ్స్, కలర్ ఫుల్ లైట్స్ మధ్య డ్యాన్సింగ్ చాలా క్రేజీగా ఉంటుంది. బంధువులు, చిన్న పిల్లలు, పెద్దవాళ్లు సైతం ఈ టైంలో హ్యాపీగా ఏంజాయ్ చేస్తుంటారు.ప్రస్తుతం అమ్మాయి, అబ్బాయి కూడా పెళ్లి బారాత్‌లో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు బుల్లెట్ బండి సాంగ్ పెట్టించుకుని మరీ రెచ్చిపోతున్నారు. దీనికి అబ్బాయి కూడా వంత పాడటంతో ఇటువంటి వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్స్‌లో వైరల్ అవుతున్నాయి.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది