Viral Video : పెళ్లి వేదికపై కాబోయే వరుడి ముందు అదిరిపోయేలా వధువు డ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పెళ్లి వేదికపై కాబోయే వరుడి ముందు అదిరిపోయేలా వధువు డ్యాన్స్

 Authored By mallesh | The Telugu News | Updated on :12 June 2022,7:40 am

Viral Video: ప్రస్తుతం పెళ్లిళ్లలో ట్రెండ్ మారింది. గతంలో పెళ్లికి వచ్చిన అతిథులు డ్యాన్స్ వేసేవాళ్లు. కానీ ఇప్పుడు వధూవరులు వేదికపై డ్యాన్స్ వేస్తూ అతిథులను అలరిస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి వేడుకలో కాబోయే వరుడి ముందు వధువు చేసిన డ్యాన్స్ చూస్తే మీరు కూడా వావ్ అని తప్పకుండా అంటారు. ముందుగా అల్లు అర్జున్ నటించిన అల వైకంఠపురంలోని రాములో రాములా అనే సాంగ్‌కు వధువు డ్యాన్స్ చేసింది.

ఆమె డ్యాన్స్ చేస్తుంటే పక్కన కూర్చున్న వరుడు తెగ సిగ్గుపడిపోయాడు. ఈ పాటలోని సిగ్నేచర్ స్టెప్‌ను కూడా వధువు, ఆమె చెల్లెలు వేసి అందరినీ అలరించారు.అనంతరం నాగచైతన్య, కృతిశెట్టి నటించిన బంగార్రాజు సినిమాల్లో బంగారా.. బంగారా.. అంటూ సాగే మాస్ సాంగ్‌కు కూడా అక్కాచెల్లెళ్లు డ్యాన్స్ చేశారు. బంగార్రాజు మూవీలోని ఈ పాట అప్పట్లో యూట్యూబ్‌ను షేక్ చేసింది. 3 కోట్లకు పైగా వ్యూస్‌ను ఈ పాట సొంతం చేసుకుంది.

bride dancing on wedding stage video viral

bride dancing on wedding stage video viral

అనంతరం సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన ప్రతిరోజు పండగే సినిమాలోని ఓ బావా.. మా అక్కను చక్కగా చూస్తావా అంటూ సాగే పాటకు వధువు చెల్లెలు డ్యాన్స్ చేసింది. ఆమె తన బావను ఉద్దేశిస్తూ చేసిన ఈ డ్యాన్స్ అతిథులతో పాటు నెటిజన్‌లను ఆకర్షించింది. ఇలా పెళ్లి వేదికపై వధువు చేసిన డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి.

https://www.youtube.com/watch?v=NXYdvMis7_E

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది