Viral Video : ఈరోజుల్లో పెళ్లి అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లిని ఎంత స్పెషల్ గా చేసుకుంటే అంత బెటర్ అన్నట్టుగా ఉన్నారు జనాలు. మీకు మరో విషయం తెలుసా? పెళ్లిళ్ల కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు.. దాన్ని స్పెషల్ గా చేసుకునేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ మధ్య పెళ్లిళ్లలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది కదా. అదే ఇప్పుడు ట్రెండ్ అని అందరికీ తెలుసు.
బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తవా.. డుగు డుగు డుగు డుగు.. అనే పాటకు డ్యాన్స్ చేసి ఓ పెళ్లి కూతురు ఎంత రచ్చ చేసిందో తెలుసు కదా. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలోనే టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కేరళలో జరిగిన ఓ పెళ్లిలో పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ అది. ఆ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసి రెండేళ్లు అవుతోంది. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video : అదిరిపోయిన పెళ్లి కూతురు ఎంట్రీ డ్యాన్స్
దానికి కారణం.. పెళ్లికూతురు వేసిన డ్యాన్స్. అవును.. అఖిల అనే యువతి తన పెళ్లిలో పెళ్లి మండపానికి చేరుకునే సమయంలో తను వేసిన యూనిక్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకే ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఈమె పెళ్లికూతురా లేక ప్రొఫెషనల్ డ్యాన్సరా.. ఏం చేసింది డ్యాన్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.