Viral Video : మండపానికి వస్తూ పెళ్లి కూతురు అదిరిపోయే డ్యాన్స్.. పెళ్లి కొడుకు ఫిదా
Viral video : పెళ్లి చూపులతో అమ్మాయికి వంట వచ్చా.. ఏం చేస్తుంది… అనే ప్రశ్నలు అడుగుతుంటారు. ఇప్పుడు ఆ కాలం పోయింది.. అమ్మాయికి డ్యాన్స్ వచ్చా.. అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే పెళ్లిలలో వధూవరులు డ్యాన్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. కొత్త పెళ్లికొడుకులు, పెళ్లి కూతుర్లు మండపాల్లోనే స్టెప్స్ వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అలాంటి వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
అయితే ఇది వరుకు రోజుల్లో అయితే పెళ్లి కూతురు సిగ్గు పడుతూ మండపంలోకి వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి కూతుర్లే డాన్స్ చేసుకుంటూ మండపంలోకి వస్తున్నారు.రాబోవు తరాల్లో పెళ్లి కూతుళ్లు మండపం లోకి డాన్స్ వేస్తూ పెళ్లి పీటలు ఎక్కే సమయం ఆసన్నమయ్యింది. అందరూ ఒక చోట చేరి అక్కడ వచ్చే మ్యూజిక్, పాటలకు, రితమిక్ గా డాన్స్ చేసి పెళ్ళి పందిరిలో కొత్త జోష్ ని నింపుతున్నారు.
ఫ్యామిలీ.. ఫ్రెండ్స్.. బంధువలు అందరూ డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. ఇక ప్రస్తుతం ఒక పెళ్లి కూతురు చేసిన డాన్స్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. ఆ పెళ్లి కూతురి మాస్ డాన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా స్టెప్స్ తో అదరగొడుతోంది.తన డాన్స్ కి పలువురు ప్రశంసలు అందించినా ఇంకొందరు మాత్రం నెగటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక ఏదైతేనేం ఆ యువతీ డాన్స్ తో దుమ్మురేపింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.