Viral Video : ఒరేయ్ ఏం అదృష్టం రా నీది .. అందరూ చచ్చిపోయాడు గ్యారెంటీ అనుకున్నారు .. ఆఖరి నిమిషంలో ట్విస్ట్… వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఒరేయ్ ఏం అదృష్టం రా నీది .. అందరూ చచ్చిపోయాడు గ్యారెంటీ అనుకున్నారు .. ఆఖరి నిమిషంలో ట్విస్ట్… వీడియో

 Authored By sekhar | The Telugu News | Updated on :31 December 2022,12:00 pm

Viral Video : ప్రస్తుత రోజుల్లో చాలా పెద్ద పెద్ద భవనాలలో లిఫ్ట్ వాడటం పరిపాటి. హాస్పిటల్స్ ఇంకా అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో లిఫ్ట్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ క్రమంలో టెక్నాలజీ తెలియక.. కొంతమంది ముసలి వాళ్లు ప్రమాదాలకు గురవుతుంటారు. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇంకా హాస్పిటల్స్ లో సైతం లిఫ్ట్ ప్రమాదాలకు గురై మరణించిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఇదే తరహాలో ఒక పెద్ద ప్రమాదం జరగగా దాని నుండి

కొద్దిపాటి క్షణాల్లో పేషెంట్ అదృష్టం కొద్దీ బయటపడ్డాడు.విషయంలోకి వెళ్తే ఓ హాస్పిటల్ లో ఓ వ్యక్తి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ పూర్తికాగానే అతడిని స్టెచర్‌ పై లిఫ్టులో వేరే చోటికి వార్డ్ బాయ్స్ లిఫ్ట్ లోకి అతడిని స్టెచర్‌ పై లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా… ఆగి ఉన్న లిఫ్ట్ ఒక్కసారిగా కిందికి వెళ్ళిపోయింది. దీంతో స్టెచర్‌పై లోపల ఉన్న పేషెంట్ కిందపడిపోయాడు. స్టెచర్‌ నిట్ట నిలువుగా నిలబడింది. కొంత కిందకు పోయిన తర్వాత లిఫ్ట్‌ ఆగిపోయింది. దీంతో అదృష్టం కొద్దీ.. పేషెంట్ స్టెచర్‌ పై నుండి… సరాసరి లిఫ్టులో నిట్ట నిలువునా పడ్డాడు.

Hospital lift news in Video Viral

Hospital lift news in Video Viral

అలాకాకుండా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని ఉంటే అతడు రెండు ముక్కలుగా చీలిపోయేవాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సిసిటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దాదాపు రెండు నెలల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటనకి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్ లు “ఒరేయ్ ఏం అదృష్టం రా నీది .. అందరూ చచ్చిపోయాడు గ్యారెంటీ అనుకున్నారు .. ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. భలే నీట్ట నిలువుగా లిఫ్టులో పడి బతికి పోయావు అని కామెంట్లు చేస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది