Viral Video : ఈ బుల్లి వెటర్నరీ డాక్టర్ ..చిన్న మేక పిల్లను తన తల్లి నుంచి ఎలా బయటకు తీసిందో చూడండి..
Viral Video : అమ్మ కడుపులో నుంచి మనం బయటకు వచ్చినట్లుగానే ఇతర జంతువులు కూడా వాటి తల్లుల కడుపు నుంచి బయటకు వస్తుంటాయి. మనుషులకు వైద్యులు ఉన్న మాదిరిగానే వాటికి కూడా వైద్యులుంటారు. అలా మేకను తన తల్లి కడుపులో నుంచి బయటకు లాగా శభాష్ అనిపించుకుంది ఓ చిన్నారి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సదరు వీడియో చూసి నెటిజన్లు బాగా హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఫిజెన్ సెజ్గిన్ అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. సదరు వీడియోలో చిన్నారి అలా మేక పిల్లను లాగుతుండటం చూసి నెటిజన్లు ముచ్చట పడుతున్నారు. బుజ్జి మేక పిల్లను బుజ్జాయి అలా బయటకు తీసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ అని పోస్టులు కూడా పెడుతున్నారు మరి కొందరు నెటిజన్లు. చిన్నారి చాలా మంచి పని చేసిందని అంటున్నారు.

little veternary doctor in video viral
Viral Video : చాకచక్యంగా మేకను బయటకు లాగిన చిన్నారి..
మేక పిల్లను తన తల్లి నుంచి బయటకు లాగిన చిన్నారి ఆ తర్వాత దానిని మళ్లీ తల్లి వద్దకు చేర్చింది. అలా తన వద్దకు వచ్చిన మేకను తల్లి నోటితో నాకుతూ.. దగ్గరకు తీసుకుంది. అలా చిన్నారి మేక పిల్లను బయటకు లాగడంతో పాటు మళ్లీ తల్లి వద్దకు చేర్చడం గొప్ప విషయమని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.
Little veterinarian. ????pic.twitter.com/CgS0PCJYDq
— Figen Sezgin (@_figensezgin) January 10, 2022