మహిళ, పురుషుడు.. ఒకరిపై ఒకరు ఉమ్ముకుని తన్నుకున్నారు.. వీడియో..!
సినిమా హాళ్లు, పెట్రోల్ పంపులు, ఇతర రద్దీ ప్రదేశాల్లో ఒక్కోసారి తోపులాటలు, తన్నులాటలు అవుతుంటాయి. ఇది మన దేశంలో అత్యంత సహజం. చాలా చోట్ల రోజూ ఎక్కడో ఒక చోట గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే అక్కడ మాత్రం ఓ వ్యక్తి, ఓ మహిళ ఇద్దరూ తన్నుకున్నారు. పెట్రోల్ పంప్ వద్ద ఆ గొడవ చోటు చేసుకుంది.
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఓ పెట్రోల్ పంపు వద్ద కార్లు పెట్రోల్, గ్యాస్ కోసం బారులు తీరాయి. సైబర్ అటాక్ కారణంగా పెట్రోల్ పంప్‌లను మూసివేస్తారని తెలియడంతో జనం ఒక్కసారిగా ఇంధనం కోసం ఎగబడ్డారు. దీంతో ఓ పెట్రోల్ పంపు వద్ద రద్దీ నెలకొంది. అయితే పెట్రోల్ కోసం పంప్ వద్ద లైన్‌లో వేచి చూస్తుండగా ఓ మహిళ కారులో ఉన్న ఓ వ్యక్తి వద్దకు వచ్చి అతనిపై ఉమ్మింది.కాగా ఆ వ్యక్తి వెంటనే కారులో నుంచి బయటకు వచ్చి ఆమె మీద ఉమ్మాడు. తరువాత ఇద్దరూ జుట్టు పట్టుకుని తన్నుకున్నారు. తరువాత ఇద్దరూ విడిపోయారు. అయితే స్థానిక పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కాగా వారు కొట్టుకునే సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
View this post on Instagram